amp pages | Sakshi

శ్రీవారి ఆలయ మూసివేతపై మారిన ఈవో స్వరం!

Published on Tue, 07/17/2018 - 11:22

సాక్షి, తిరుమల : మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సుమారు తొమ్మిది రోజులపాటు మూసివేస్తామని ప్రకటించి.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు తాజాగా స్వరాన్ని మార్చింది. మహా సంప్రోక్షణ సమయంలో గత నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశమై.. భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేసే విషయమై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయమై వారంలోగా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ఈవో చెప్పారు. మహా సంప్రోక్షణ సందర్భంగా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు రెండు విడతలుగా శ్రీవారి దర్శనం భక్తులకు కల్పించాలని యోచిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న సమయం, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

విమర్శలు, ఆగ్రహం
మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని టీటీడీ మొదట నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇటు భక్తులు, అటు హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా భక్తులు నిరసనలు వ్యక్తం చేశారు. ఆలయాన్ని మూసివేస్తామని చెప్పడం వెనుక కుట్ర దాగుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం వ్యక్తం​ చేశారు. మహా సంప్రోక్షణ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపేస్తామనడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌