More

మతిస్థిమితం లేని యువతిపై లైంగికదాడి

27 Feb, 2015 23:53 IST

ప్రకాశం (పామూరు): మతి స్థిమితం సరిగాలేని యువతిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని బొట్లగూడూరు పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కమ్మవారిపాలేనికి చెందిన 18 ఏళ్ల యువతి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉండగా..ఆమె తల్లి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు వెళ్లింది. ఆమె తండ్రి పనిమీద పామూరు వచ్చాడు. యువతి ఒక్కటే ఇంట్లో ఉందని గమనించిన సమీప గ్రామం కొత్తపల్లికి చెందిన తురకా బాబు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

మధ్యాహ్నం వంట ముగించుకుని కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన యువతి తల్లి తమ ఇంటి వాకిలి వేసి ఉండటం గమనించి తలుపును పెద్దగా తట్టింది. బాబు ఒక్కసారిగా తలుపు తీసి బయటకు పరుగెత్తాడు. తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా యువతి రక్తస్రావమై పడి ఉంది. పరిస్థితి అర్థం చేసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన డీఎస్పీ అజయ్‌ప్రసాద్, సీఐ మల్లి రాజేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వారి నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలిని కనిగిరి వైద్యశాలకు తరలించారు. అనంతరం పామూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆహార’ ఉత్పత్తులకు ­ఊతం

పైకి పొత్తులు.. లోపల కత్తులు

ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు

గజ వాహనంపై శ్రీమహాలక్ష్మి దర్శనం

బడుల పైనా ‘బండ’ రాతలే!