మేడారం జాతరకు 30 జన్‌ సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు 30 జన్‌ సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు

Published Sun, Feb 18 2024 4:39 AM

SCR to operate 30 special trains to Medaram jatara - Sakshi

సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్‌: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్‌ సాధా రణ్‌ ప్రత్యేక రైళ్ల సర్విస్‌లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్‌ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్‌ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. 

ప్రత్యేక రైళ్ల వివరాలు  
► సికింద్రాబాద్‌–వరంగల్, వరంగల్‌–సికింద్రాబాద్‌ మధ్య 10 రైళ్లు, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–వరంగల్, వరంగల్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్‌–వరంగల్, వరంగల్‌–నిజామాబాద్‌ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్‌–వరంగల్, వరంగల్‌–ఆదిలాబాద్‌ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్‌–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. 

► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్‌–వరంగల్‌ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్‌–సికింద్రాబాద్‌ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది.  
► 21వ తేదీన వరంగల్‌–ఆదిలాబాద్‌ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్‌ చేరుతుంది.  

► 22వ తేదీన ఆదిలాబాద్‌–వరంగల్‌ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్‌ చేరుతుంది.  
► 23 తేదీన ఖమ్మం–వరంగల్‌ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది.  
► 24న వరంగల్‌–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. 

భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి 
మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యా­టక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు.  ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధి­తో పనిచేస్తోంది. అందు­లో భాగంగానే.. తెలంగా­ణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సార­క్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల­ను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement