మజ్లిస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు నో ఛాన్స్‌! | Sakshi
Sakshi News home page

మజ్లిస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు నో ఛాన్స్‌!

Published Wed, Nov 1 2023 7:35 AM

Charminar sitting MLA Mumtaz Ahmed Khan No Chance  - Sakshi

హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. మజ్లిస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి చార్మినార్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు టికెట్‌ లభించదని ప్రచారాలు జరగుతుండడంతో.. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ కాకుండా మరెవరికి టికెట్‌ కేటాహిస్తారోనని చార్మినార్నియోజకవర్గం మజ్లిస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ ఈసారి ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు పార్టీ టికెట్‌ లభించకపోతే.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ తెచ్చుకుని మరీ పోటీ చేయించడానికి ఆయన కుమారులు పట్టుబడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చారి్మనార్, యాకుత్‌పురా నుంచి కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు గతంలోనే చెప్పారని.. దీంతో ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో పాటు సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీలకు ఈసారి టికెట్లు లభించవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

చివరి నిమిషం వరకు వేచి ఉండి.. 
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యాకుత్‌పురా సిట్టింగ్‌ ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ నిశబ్దంగా ఉన్నప్పటికీ.. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ మాత్రం తనకు టికెట్‌ ఇవ్వకపోతే.. తన తనయునికి టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. ఇక టికెట్‌ రాదని తెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్‌ పార్టీలోకి పార్టీ మారడం తప్పా.. ఆయన వద్ద మరో మార్గం లేదంటున్నారు. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే.. తమ పార్టీలోకి ఆహా్వనించి చార్మినార్‌ నుంచి టికెట్‌ ఇచ్చి ఎన్నికల బరిలో దింపడానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పటికే టీటీడీపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న అలీ మస్కతిని చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపుతున్నట్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలైన అధికారిక లిస్టులలో ఎక్కడా అలీ మస్కతి పేరు లేకపోవడంతో ముంతాజ్‌ఖాన్‌ కోసం ఈ సీటు రిజర్వ్‌ పెట్టినట్లు పాతబస్తీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చార్మినార్ నుంచి ముంతాజ్‌ ఖాన్‌కు టికెట్‌ లభిస్తే.. అలీ మస్కతిని హైదరాబాద్‌ పార్లమెంట్‌కు పోటీ చేయించే యోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంత వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీ చార్మినార్ అభ్యరి్థని ప్రకటించడం లేదని అంటున్నారు. 

ఈసారి మజ్లిస్‌  పార్టీకి దీటుగా.. కాంగ్రెస్‌ 
చార్మినార్ నుంచి మజ్లిస్‌ పార్టీకి దీటుగా తమ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీతో మజ్లిసేతర పార్టీలు హోరాహోరి ఎన్నికల పోరాటం చేసినప్పటికీ.. అంతిమ విజయం మజ్లిస్‌ పార్టీకే దక్కింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈసారి పాతబస్తీలో కూడా ఊహించని రాజకీయ పరిణాలు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. 

మజ్లిస్‌ పార్టీలో సిట్టింగ్‌లకు టికెట్లు లభించకపోతే.. పాతబస్తీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ రాజకీయ అరంగేటం బజ్లిస్‌ బజావ్‌ తెహ్రీఖ్‌(ఎంబీటీ­)తో మొదలైంది. ఎంబీటీ పార్టీ టికెట్‌పై యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం పార్టీ ఫిరాయించి మజ్లిస్‌ పారీ్టలో చేరారు. అప్పటి నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం చారి్మనార్‌ నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ పార్టీ మారే ప్రసక్తే ఉండదని.. ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని దారుస్సలాం నాయకులు అంటున్నారు.  

Advertisement
Advertisement