ఆపరేషన్ అజయ్: భారత్‌ చేరిన ఐదో విమానం | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ నుంచి 286 మందితో భారత్ చేరిన ఐదో విమానం.. 18 మంది నేపాలీలు కూడా..

Published Wed, Oct 18 2023 12:57 PM

Fifth Flight 286 Indians Arrives In Delhi From Israel - Sakshi

ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ అజయ్‌ నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా 286 మందితో కూడిన మరో విమానం భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత్‌ తిరిగి వచ్చిన వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. 

ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్‌ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళ వాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇటు ఇజ్రాయెల్‌, అటు పాలస్తీనాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. దీంతో స్వదేశానికి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో సుమారు 900పైగా మందిని భారత్‌కు తరలించారు. తాజాగా ఐదో విమానం చేరుకుంది.  

ఇదీ చదవండి:  గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి


 

Advertisement
Advertisement