లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి | Sakshi
Sakshi News home page

లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి

Published Thu, Apr 18 2024 9:40 AM

- - Sakshi

జడ్చర్ల టౌన్‌: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామిని బుధవారం జిల్లా జడ్జి పాపిరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి చేరుకోగా.. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను పూజారులు న్యాయమూర్తికి వివరించారు. అక్కడి నుంచి కోడ్గల్‌ సమీపంలోని నచికేత తపోవన ఆశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో సేవా కార్యక్రమాల వివరాలను ఆలయ నిర్వాహకుడు నచికేత గురూజీ న్యాయమూర్తికి వివరించారు. ఈసందర్భంగా జడ్చర్ల కోర్టు జడ్జి లక్ష్మి, ముదాత్‌అలీ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జంగయ్య ఉన్నారు.

అలరించిన వసంతకవితోత్సవం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్‌ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్‌గౌడ్‌, గుముడాల చక్రవర్తి గౌడ్‌, జగపతిరావు, వెంకటేశ్వర్‌రావు, కమలేకర్‌ శ్యాంప్రసాద్‌రావు, అనురాధ, పులి జమున, సుజాత, రజని, మధుసూదన్‌ జోషి, మహేష్‌, రమేశ్‌, బసవ రాజప్ప, ప్రాణేష్‌, కృష్ణకుమార్‌ తదితరులు కవితలు వినిపించి ఆకట్టుకున్నారు.

నేటినుంచి యథావిధిగా మార్కెట్‌ లావాదేవీలు

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం సెలవు దినం కావడంతో వారానికి ఒక సారి జరిగే ఉల్లి వేలం జరగకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువారం నుంచి మార్కెట్‌లో యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌లో టెండర్ల ద్వారా అమ్ముకోవచ్చని చెప్పారు.

సివిల్స్‌ ర్యాంకర్‌ అనన్యరెడ్డికి సన్మానం

అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్‌ సాధించిన పొన్నకల్‌ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు మహిమూద్‌, విజయకుమార్‌రెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జాజాల రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement