సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ | Sakshi
Sakshi News home page

సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ

Published Sun, Oct 8 2023 9:32 AM

Prawn Stuffing Bread Roll Is Very Easy And Tasty Evening Snack - Sakshi

కావలసినవి:  

రొయ్యలు – 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చిన్నగా కట్‌ చేసుకోవాలి)
ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌
క్యారట్, బీట్‌రూట్‌ తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం – 1 టీ స్పూన్‌ చొప్పున
బ్రెడ్‌ స్లైసెస్‌ – 10 
(నాలుగువైపులా అంచులు కట్‌ చేసి పెట్టుకోవాలి)
పాలు – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
గుడ్లు – 2 (అందులో, కొద్దిగా పాలు కలుపుకోవాలి)


తయారీ: ముందుగా 1 టేబుల్‌ స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారట్‌ తురుము, బీట్‌రూట్‌ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకుని.. అందులో మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని కలిపి కాసేపు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో ఉడికిన రొయ్యల ముక్కలు వేసుకుని, 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్‌ స్లైస్‌కి ఒకవైపు కొద్దిగా రొయ్యల మిశ్రమం పెట్టుకుని.. మిగిలిన మూడు చివర్లకు పాలు రాసి రోల్స్‌లా చేసుకుని, అంచులు ఊడకుండా అతికించాలి. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

(చ‌ద‌వండి: సాయంత్రం స్నాక్స్ గా చిల‌క‌డ‌దుంప బ‌జ్జీలు )

Advertisement
 
Advertisement
 
Advertisement