కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు! | Sakshi
Sakshi News home page

<script>
document.addEventListener("DOMContentLoaded", function() {
 var newsContent = document.querySelector(".news-story-content");
    var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p"));
 
  var firstParagraph = paragraphs.find(function(paragraph) {
       return !paragraph.closest('.bullet_list');
   });
  if (firstParagraph.length > 1) {
   var secondParagraph = firstParagraph[1];

 var script = document.createElement("script");
 script.async = true;
 script.id = "AV62ff84d96d945e7161606a7a";
 script.type = "text/javascript";
 script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…";
 
 secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling);
}
});
</script>

కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!

Published Sun, Jan 14 2024 1:07 AM

ఫోటో కర్టసీ (టైమ్స్‌నౌ) - Sakshi

అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో  తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం  ఆశ్చర్యపోవడం ఖాయం.

బీహార్‌లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే  అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్‌ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం.

ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో  అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది.

ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది.  ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్‌ సెన్స్‌ యాక్టివేషన్‌ లేదా థర్డ్‌ ఐ యాక్టివేషన్‌గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. 

(చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! )

Advertisement
Advertisement