ప్రణీత్‌రావు బాగోతం.. ప్రభుత్వానికి కీలక నివేదిక | Sakshi
Sakshi News home page

ప్రణీత్‌రావు బాగోతం.. ప్రభుత్వానికి కీలక నివేదిక

Published Fri, Mar 8 2024 1:45 PM

Report To Govt In Ex Sib Dsp Praneeth Rao Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు.

ఎస్ఐబీలోని కీలక ఫైల్స్‌ను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద ప్రణీత్‌రావు పై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. రహస్య సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాలు తస్కరించడం వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్ధమైంది.

హార్డ్ డిస్క్‌లు నాశనం చేసినందుకు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వాస్తులు ధ్వంసం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావ్ వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. అత్యంత సంచలనాత్మకమైన వ్యవహారంపై సీఐడి లేదా సిట్‌కు కేసును అప్పగించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement