-
‘క్రేన్’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత
-
‘క్రేన్’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత
తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూత సాక్షి, గుంటూరు: క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు (87) తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. క్రేన్ సంస్థలను స్థాపించి వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి కల్పించారు. శుక్రవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని గుంటూరు సంపత్‌నగర్‌లోని క్రేన్సంస్థలో సందర్శనార్థం ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతాపాన్ని ఆయన కుమారుడు గ్రంథి కాంతారావుకు తెలియజేశారు. రూ.150లతో మొదలైన ప్రస్థానం 1958లో అప్పటి గుంటూరులో రూ.150 పెట్టుబడి తో క్రేన్ వ్యాపారాన్ని గ్రంథి సుబ్బారావు మొదలు పెట్టారు. అది కూడా సైకిల్‌కు రెండు వక్కపొడుల సంచులు తగిలించుకుని ఊరంతా తిరిగి విక్రయించే వారు. అలా మొదలైన క్రేన్ ప్రస్థానం అంచెలం చెలుగా ఎదిగి అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం 300 మంది కార్మికులు వందల సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లు క్రేన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ఆవుపాలను, ప్రస్తుతం పెరుగును మార్కెట్లోకి విడుదల చేశారు. ‘స్వీయ సాధనలో’ అనే పేరుతో తన వ్యాపార విజయ ప్రస్థానాన్ని, ఔత్సాహిక వ్యాపారులకు ఇచ్చే సలహాలు, సూచనలతో పుస్తకం రచించారు. టీటీడీ ధార్మిక మండలి సభ్యులుగా... తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహా మండలి సభ్యులుగా గ్రంథి సుబ్బారావు ఉన్నారు. గుంటూరు సంపత్‌నగర్‌లో అయ్యప్పస్వామి దేవ స్థానం నిర్మించి ప్రతిఏటా రోజుకు 4వేల మందికి చొప్పున 40 రోజులపాటు అయ్యప్పలకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే అంకిరెడ్డిపాలెం సమీపంలో భారీ వినాయకుడి మందిరం నిర్మించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Buddy First Single: పాటతో రూమర్స్‌కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
‘పీవోకే’ భారత్‌లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement