-
ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..
వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్‌గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్‌పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్టెయిల్ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్టెయిల్ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్‌ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్ టు రివర్స్ సెల్యులర్ ఏజింగ్" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్ ఏజింగ్ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్ కాక్టెయిల్స్తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయన కాక్టెయిల్లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్త సింక్లైర్. (చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!) -
బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి..
జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది. బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు. అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు! -
CoronaVirus: మన కాక్టెయిల్ ట్రయల్స్‌కి పర్మిషన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్‌లో ట్రీట్మెంట్ కొరత ప్రధాన సమస్యగా మారింది. మందులు, వ్యాక్సిన్ల కొరత కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల మీద ప్రభుత్వాల దృష్టి మళ్లుతోంది. ఇప్పటికే భారత మార్కెట్లోకి యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్మెంట్కు పర్మిషన్ దొరికింది. ఈ క్రమంలో జైడస్ కాడిల్లా క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతులు దక్కించుకుంది. మైల్డ్ సింప్టమ్స్(ఓ మోస్తరు) లక్షణాలున్నకోవిడ్ పేషెంట్లలో జైడస్ వారి యాంటీబాడీ కాక్టెయిల్ని మనుషులపై ప్రయోగించి చూసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. గుజరాత్‌కు చెందిన జైడస్ కాడిల్లా వారి జెడ్ఆర్సీ-3308, ట్రయల్స్ దశలో జంతువుల లంగ్ డ్యామేజ్‌ను తగ్గించింది. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో ఉండే కాక్టెయిల్, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకాల తరహాలో ఇన్ఫెక్షన్తో పోరాడుతుందని జైడస్ కాడిల్లా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్లో పురోగతి అవసరమని జైడస్ కాడిల్లా ఎండీ శార్విల్ పటేల్ తెలిపారు. మనుషుల ఎర్లీ టు లేట్ స్టేజ్ ట్రయల్స్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు అమెరికాలోనూ అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ట్రీట్మెంట్స్కి అనుమతి చ్చింది. రెగెనెరోన్, రోచె యాంటీ బాడీ కాక్టెయిల్ ఇదివరకే భారత్‌లో అనుమతులు దక్కించుకోగా, ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దానిని సరఫరా చేస్తోంది. ఇది చదవండి: కాక్టెయిల్ హైరిస్క్ తప్పిస్తుంది! -
ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా?!
హృద్యమైన నవ్వుతో.. చేతిలో పచ్చని చెట్టుతో ఫొటోకు ఫోజులిచ్చిన ఈ చిన్నారిని గుర్తు పట్టగలరా..? మీ వల్ల కాదంటారా...! మరేం పర్లేదు... ‘పెంటీ ఇంట్లో ఉన్న మిస్ బొటానిస్ట్ను కలవండి’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ.. ఈ ఫొటోకు క్యాప్షన్ జత చేసి హింట్ కూడా ఇచ్చారు. ఏంటీ ఇంకా అర్థం కాలేదా.. ! ఆ బుజ్జాయి మరెవరో కాదు డయానా పెంటీనే. థర్స్డేత్రోబ్యాక్ హ్యాష్‌ట్యాగ్‌తో డయానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. అందుకే పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోపే ఈ ఫొటోకు 90 వేలకు పైగా లైకులు వచ్చాయి. కాగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన డయానా పెంటీ.. ‘కాక్టెయిల్’ మూవీ ద్వారా 2012లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో.. డయానా తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ తర్వాత హ్యాపీ బాగ్ జాయేగీ, లక్నో సెంట్రల్, జాన్ అబ్రహాం సరసన ’పరమాణు’ తదితర చిత్రాల్లో నటించారు. View this post on Instagram Meet Ms. Botanist from the house of Penty! 😬 #ThrowbackThursday A post shared by Diana Penty (@dianapenty) on Jan 31, 2019 at 12:37am PST -
‘పుస్తకంలాగా పొట్టను తెరవాల్సి వచ్చింది’
న్యూఢిల్లీ: కాక్టెయిల్ తాగిన ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్త దాదాపు చావు అంచులకు వెళ్లాడు. ఎందుకంటే అతడు తాగింది.. కాక్టెయిల్ మాత్రమే కాదు.. అందులో లిక్కిడ్ నైట్రోజన్ కూడా కలిసి ఉంది. దీంతో తాగిన కొద్ది సేపటికే అతడి కడుపులో ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు పడిపోయాయి. దీంతో వేరే దారిలేక వైద్యులు అతడి పొట్టను తెరిచిన పుస్తకం మాదిరిగా చీల్చి శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త అయిన ఓ 30 ఏళ్ల వ్యక్తి గుర్గావ్లోని పబ్‌కు వెళ్లాడు. మెనూ చూసి కొత్తగా వచ్చిన కాక్టెయిల్ ట్రై చేయాలని నిర్ణయించుకున్నాడు. పొగలు కక్కుతున్నప్పటికీ అందులో లిక్విడ్ నైట్రోజన్ ఉందనే విషయం గుర్తించకుండా గబాళ్లున తాగేశాడు. కడుపులోపల ఆందోళనగా అనిపించినా అదేం పట్టించుకోకుండా మరో మందు తీసుకొని తాగేశాడు. కొద్ది సెకన్లలోని అతడి కడుపులో ఒక రకమైన భరించలేని నొప్పరావడంతోపాటు శ్వాసతీసుకోవడం కష్టమైపోయింది. భరించలేని వాసన రావడం ప్రారంభమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అతడి కడుపు లోపల రెండు రంద్రాలు అయినట్లు గుర్తించారు. దీంతో అతడికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేశారు. సాధారణంగా లిక్విడ్ నైట్రోజన్ లోపలికి వెళ్లాక అది బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని, ఆ క్రమంలో అవసరం అయితే, పొట్ట పేలిపోతుందని కూడా వైద్యులు హెచ్చరించారు. -
'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ
లండన్ః స్కిన్ క్యాన్సర్ నివారణకు డ్రగ్ కాక్టెయిల్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిసోధనలు చెప్తున్నాయి. రెండు వ్యాధి నిరోధక మందులు కలపడంతో రోగుల జీవిత కాలాన్నిమరింత పొడిగించవచ్చని, అన్ని రకాల మెలనోమాను నాశనం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మ క్యాన్సర్ ను చివరి దశలో గుర్తించినా నివారించవచ్చని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. స్మార్ట్ ఔషధాల కలయిక చర్మ క్యాన్సర్ ను నివారిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రెండు ఔషధాలను కాక్టెయిల్ చేసి రోగుల్లోని అన్ని రకాల మెలనోమాను నివారించ గలిగినట్లు అధ్యయనకారుల పరిశోధనా ఫల్లితాలు వెల్లడించాయి. ఒకవేళ క్యాన్సర్ శరీరంలోని ఇదర భాగాలకు వ్యాపించినప్పటికీ ఈ కొత్త పద్ధతితో తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. 2013 లో బ్రిటన్ లోని 14,500 మందిలో మెలనోమా వ్యాపించగా అందులో 2,100 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. తాజాగా కనుగొన్న ఈ కాక్టెయిల్ పద్ధతిలో వైద్యులు సింగిల్ గానూ రెండు మందులను కలపి మెలనోమా ఉన్న 142 మంది రోగులకు అందించారు. కొత్త ప్రయోగంతో 69 శాతం రోగుల్లో మంచి ఫలితాలు కనిపించాయని, ఒకటే మందును ఇచ్చిన 53 శాతంమంది రోగులకన్నా... రెండు మందులను కలిపి ఇచ్చిన రోగులు మరో రెండు సంవత్సరాలు తర్వాత కూడ బతికే ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కాక్టెయిల్ మందు తీసుకున్న 22 శాతంమందిలో క్యాన్సర్ పుండును పూర్తిగా నిర్మూలించినట్లు గుర్తించారు. దీంతో ఇపిలిముమాబ్ (కాక్టెయిల్ డ్రగ్) మంచి ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్నారు. రెండు ఔషధాల కలయిక క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలిస్తుందని, రోగంతో సమర్థవంతంగా పోరాడుతుందని లారిన్ మర్శేన్ ఆస్పత్రి సలహాదారుడు డాక్టర్ జేమ్స్ లార్కిన్ తెలిపారు. ఈ కొత్త పరిశోధనలు రోగులకు, వారి కుటుంబ సభ్యులకు మరింత ఆశను కల్పించాయని తెలిపారు. పరిశోధనా ఫలితాలను ఆమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్స్ వార్షిక సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ రెండు ఔషధాల కలయికను బ్రిటన్ లో ప్రయోగించేందుకు ఇంకా ఆమోదించలేదు. ఈ కొత్త పద్ధతిలో వైద్యం కొంత ఖరీదు అవుతుందని, అయితే మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ పద్ధతిని అనుమతిస్తే... ఖరీదు విషయం తర్వాత ఆలోచించవచ్చని బ్రిటన్ క్యాన్సర్ రీసెర్స్ లోని డాక్టర్ ఆనె మెక్ కార్తీ అంటున్నారు. మరోవైపు తాను ఇంతకు ముందు ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నానని, ఇప్పుడు మరో రెండేళ్ళు బతికే ఉన్నానంటే ఈ కొత్త పరిశోధనల ఫలితమేనని కాక్టెయిల్ డ్రగ్ ను వినియోగించిన రోగి కూడ చెప్తున్నారు. -
వర్మ పేరుతో పబ్ లో ...కాకటైల్ ప్రారంభం
-
కాక్ టేల్.కామ్
లక్కుండిన చుక్కొచ్చును,చుక్కడితే గొంతులోన చురచురమంటూ గుక్కలుగా కిక్కెక్కును కిక్కెచ్చిన వైనుతేయ! కిరికిరి మొదలౌ! ‘బుడ్డి’మంతులు ఎంత తాపత్రయపడ్డా... కూసింత లక్కుంటే గానీ గొంతు తడుపుకోవడానికి గుక్కెడు చుక్క దొరకదు. లక్కు కలిసొచ్చి, అనాయాసంగా చుక్కేం ఖర్మ, ఏకంగా నిండైన ‘సీసా’పద్యమే చేతికి అందివస్తే! అలాంటి అరుదైన సందర్భాన్నే ‘మందు’భాగ్యమంటారు ‘మందు’ మతులు. ‘మందు’భాగ్యం కలిగినప్పుడు మనసు మదిరానంద డోలికలలో తేలియాడటం కద్దు! అట్టి మదిరానంద తరుణాన ‘బుడ్డి’మంతులందరూ కలసి తగిన ‘మందో’బస్తుతో పీనాబజానా ఏర్పాటు చేయడం ‘సారా’మామూలే! మొదటి పెగ్గు మధువులోని మంచుముక్కలు కరిగేలోగానే గొంతులోకి జారిపోతుంది. మనసు తేలికవుతుంది. రెండో పెగ్గు కొనసాగుతున్న స్థితిలో ‘సారా’స్వత సమావేశంలో సర్వసమానత్వ స్థితి మొదలై, వాతావరణం ప్రజాస్వామికమవుతుంది. మూడోది ముగిసి, ఆపై ముందుకెళితేనే తంటా! కొందరికి కిక్కు హెచ్చి కిరికిరి మొదలవుతుంది. ప్రజాస్వామ్యం ముదిరి అరాచకవాదంగా పరిణమిస్తుంది. అట్టి దుష్పరిణామాలను నియంత్రించగల ‘మందు’జాగ్రత్తపరుల కోసం ఈ వారం.. ‘మధు’రోక్తి మధువు మనుషులందరినీ సమానం చేసేస్తుంది. అది సిసలైన ప్రజాస్వామికవాది. - టెర్రీ ప్రాట్షెట్, బ్రిటిష్ రచయిత డార్క డిలైట్ వోడ్కా : 30 మి.లీ. డార్క్ రమ్ : 30 మి.లీ. కోకాకోలా : 60 మి.లీ. సోడా : 90 మి.లీ. గార్నిష్ : ఐస్‌క్యూబ్స్, ఆరెంజ్ ట్విస్ట్ వైన్‌తేయుడు -
డబ్బు కాదు ... ప్రేమ, ప్రశంసలే ముఖ్యం
ముంబై : ప్రేమ, ప్రశంసలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పష్టం చేశారు. ఆ రెండు తన జీవితంలో ముఖ్యమైనవే కాదు విలువైనవి కూడా అని ఆమె తెలిపారు. విజయానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వనిని ఆమె అన్నారు. డబ్బుకు అయితే చివరి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఆ ప్రశంసల కోసమే సినిమాలలో నటిస్తున్నానంటే పొరపాటు పడినట్లేనని దీపికా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలు వెరైటీ పాత్రలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న దీపికా పదుకొనె శుక్రవారం ముంబైలో విలేకర్లతో మాట్లాడారు. హీరోయిన్ కావడం అంత ఈజీ కాదని.... హీరోయిన్ కావడం కోసం తాను ఎంత కష్టపడింది ఆమె వివరించింది. తాను హీరోయిన్గా కంఫర్ట్ జోన్ చేరానని భావిస్తున్నానన్నారు. హృదయానికి హత్తుకునేలా ఉండే కథలలో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. అంతేకాని బాక్సాఫీసు వద్ద తాను నటించే సినిమా హిట్ అవుతుందా? లేక ఆ చిత్రం కోట్లాది రూపాయిల వ్యాపారం చేస్తుందా అని ఆలోచించనని తెలిపారు. దీపికా పదుకొనె తాజాగా నటించిన చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలపై అందరు దృష్టి సారించారు. ఓం శాంతి ఓం చిత్రంలో దీపికా నటనపనై విమర్శకులు విమర్శలు కురిపించారు. ఆ తర్వాత ఆమె నటించిన కాక్ టయిల్, యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్... చిత్రాలలో ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. -
ఎక్స్ట్రీమ్ ఎగ్నాగ్
కాఫీని సేవించ కాఠిన్యమే కరుగు తేనీరు తాగంగ తేజమొచ్చు మధువు గ్రోలునపుడు మాధుర్యమే హెచ్చు విశ్వజనులకెల్ల వైనుతేయు! ‘మధు’రోక్తి ‘అంతా నా తాగుడు గురించే మాట్లాడతారు.. నా దాహాన్ని గురించి ఆలోచించరేం..?’ - స్కాటిష్ సామెత ‘సిటీ’జనులలో కొందరు కాఫీగత ప్రాణులు, ఇంకొందరు టీ తప్ప మరో పానీయూన్ని ముట్టని ‘టీ’టోటలర్లు. అబ్కారీ లెక్కల సాక్షిగా మెజారిటీ మాత్రం ‘మద్య’తరగతి జీవులే! ‘మద్య’తరగతి మహాజనులలో అత్యధికులు లౌకికవాదులు. పానీయూల పట్ల వారు చాలా నిష్పాక్షికులు. ప్రాతఃసంధ్యలో కాఫీని, మధ్యాహ్న సంధ్యలో తేనీటిని, సాయుంసంధ్యలో వుధువును తీర్థంగా పుచ్చుకుంటారు. తవు అభిమాన స్వవుత పానీయూన్ని గౌరవిస్తూనే, పరపానీయూలనూ సవూదరిస్తారు. ప్రాచీనతనే ప్రావూణికంగా తీసుకుంటే, కాఫీ కంటే తేనీరు, తేనీటి కంటే వుధువు ప్రాచీనమైనవి. వుంచినీళ్ల తర్వాత వూనవుడు ఆస్వాదించిన అత్యంత ప్రాచీన పానీయుం మధువు వూత్రమే. కాఫీని, తేనీటిని ‘తీర్థం’కరులు ‘ఉప’ద్రవాలుగా పరిగ్రహించడం కద్దు. తీర్థాన్ని పోషక పానీయుంగా మార్చేందుకు గుడ్డు సొననూ కలిపికొట్టే ‘గుడ్డు’బాయ్స్ లేకపోలేదు. ప్రపంచ గుడ్డు రోజు సందర్భంగా ఈ వారం మీకోసం.. ఎక్స్ట్రీమ్ ఎగ్నాగ్ కోన్యాక్ బ్రాందీ: 30 మి.లీ. ఐరిష్ విస్కీ: 20 మి.లీ. పాలు: 90 మి.లీ. క్రీమ్: 60 మి.లీ. గుడ్డు: ఒకటి పంచదార: 2 టేబుల్ స్పూన్లు గార్నిష్: లవంగాలు, దాల్చిన చెక్క - వైన్‌తేయుడు -
నన్ను గారం చేసి చెడగొడుతున్నారు: దీపిక
డింపుల్ కపాడియా తనను కన్నకూతురిలా భావించి.. గారం చేస్తూ బాగా చెడగొడుతున్నారని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే చెబుతోంది. అసలు డింపుల్జీతో తన అనుబంధం గురించి మాటల్లో ఏ మాత్రం చెప్పలేనని, ఆమె తెలిపింది. 'కాక్టెయిల్' సినిమాలో తామిద్దరం కలిసి నటిస్తున్నప్పుడు ఆమె తనను భోజనానికి బయటకు తీసుకెళ్లేవారని, షాపింగ్ కూడా చేయించేవారని తెలిపింది. డింపుల్ కపాడియా తనను కన్నకూతురిలా గారం చేసి చెడగొడుతున్నారని గోముగా చెప్పింది. కాక్ టెయిల్ సినిమా సెప్టెంబర్ 12న విడుదల అవుతోంది. ఇది చాలా విభిన్నమైన సినిమా అవుతుందని, ప్రోమోలు చూసినప్పుడు ఆ విషయం తెలిసిందని దీపిక అంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. హోమీ అడజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తనకు తన మాతృభాష అయిన కొంకణిలో మాట్లాడే అవకాశం కూడా వచ్చిందని దీపిక తెలిపింది. -
మగాడికోసం కొన్ని ఆప్స్..!
మగాడిగా బతకడం ఒక ఆర్ట్... ఈ మాట పురుషాహంకారం కాదు. బాధ్యతలు నెరవేరుస్తూ, బంధాలను బ్యాలెన్స్ చేస్తూ, బ్యాలెన్స్ షీట్ సరిచూసుకొంటూ, సరదాలకు లోటు రాకుండా చూసుకొంటూ అనుకోకుండా ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లను దాటుకొంటూ.... షికారు చేయడమే ఆ ఆర్ట్. మరి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు సాయంగా వచ్చే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు కొన్ని ఉన్నాయి. వర్తమానంతో కనెక్ట్ అవుతూ జీవితాన్ని సాఫీగా గడపడానికి సాయంగా వస్తామంటున్నాయివి. స్మార్ట్‌ఫోన్ ఇన్స్టాల్ చేసుకొంటే వీటితో సరదా తెలుస్తుంది! టై ఏ టైమ్ డీలక్స్... చిన్నప్పుడయితే అమ్మ దగ్గరుండి స్కూల్‌కు రెడీ చేసి పంపిస్తుంది. అలా ఆఫీస్‌కు రెడీ చేసి పంపించే వాళ్లు ఉండరు కదా. బ్యాచిలర్ అయితే దగ్గరుండి టై కట్టి పంపే వాళ్లు ఉండరు కదా... మరి టైని టై చేయడంలో కూడా ప్రావీణ్యం సంపాదించాల్సిందే. అలాంటి ప్రావీణ్యతను అలవాటు చేస్తుంది ఈ అప్లికేషన్. ఇల్లస్ట్రేటెడ్ ఇన్స్ట్రక్షన్స్తో పూర్తి వివరాలు లభ్యమవుతాయి ఈ అప్లికేషన్లో. స్టెప్ బై స్టెప్ పద్ధతిలో మొత్తం ఏడు రకాలుగా టై కట్టుకొనే పద్ధతులు వివరంగా ఉంటాయి. కాక్టెయిల్ మేడ్ ఈజీ... తాగడం అలవాటున్న వారి కోసమే ప్రత్యేకమైనది ఈ అప్లికేషన్. వైన్కీ విస్కీకి ఉన్న తేడా ఏమిటో చెప్పడం దగ్గర నుంచి దాదాపు 500 రకాల కాక్టెయిల్లను కలపడం గురించి ట్రైన్ చేస్తుంది ఈ అప్లికేషన్. కాక్టెయిల్ను కాన్ఫిడెన్స్‌తో కలిపేలా మిమ్మల్ని తీర్చిదిద్దుతామంటూ ఈ అప్లికేషన్ హామీ ఇస్తుంది. ప్రతి రెసిపీ కూడా ఇమేజ్‌గా ఆయా రంగులతో చాలా స్పష్టంగా ఉంటుంది ఇందులో. బ్రిటిష్ బార్టెండర్ సిమన్ డిఫోర్డ్ ఈ అప్లికేషన్‌ను రివ్యూ చేశారు. ఎవ్రీ ట్రయల్స్... ఇష్టమైన దారిలో ప్రయాణిస్తున్నప్పుడు, ఇష్టమైన దాన్ని అందుకోవడానికి వెళుతున్నప్పుడు లక్ష్యానికి దగ్గరవుతున్నామనే ఫీలింగ్‌కు ఎంతో ఉద్వేగానికి గురి చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలను అందించే అప్లికేషన్ ఎవ్రీట్రయల్స్. జీపీఎస్ ద్వారా మనం చేరాల్సిన కేంద్రాన్ని ఎంటర్‌చేస్తే చాలు. మీ వేగానికి తగ్గట్టుగా డిజిటల్ మీటర్లా పనిచేస్తూ సూచికగా ఉపయోగపడుతూ ఉంటుంది. మెన్స్ హెల్త్వర్కవుట్ ఆప్.. పేరులోనే మగాడి ఆరోగ్యం గురించి గైడ్ అనే విషయాన్ని చెబుతుంది ఈ అప్లికేషన్. ప్రత్యేకించి జిమ్‌లో చేసే వ్యాయమంలో ట్రైనర్లా ఉపయోగపడుతుంది. ఏ ఎక్సర్సైజ్ను ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి, ఎక్సర్సైజ్చేస్తున్న సమయంలో శరీరాన్ని ఎలా ఉంచాలి? అనే విషయాల గురించి సూచనలు అందిస్తుంది. మెన్స్ ెహ ల్త్ గురించి వచ్చే దాదాపు 20 మ్యాగ్జిన్లలోని కంటెంట్‌ను కూడా అప్డేట్ చేస్తుంటుంది. మనిల్లా.. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతూ పోతాయి. టీనేజ్లోనే ఎక్స్ఛేంజ్కు వెళ్లి టెలిఫోన్ బిల్ కట్టడంతో మొదలు.. వ్యక్తిగా కుటుంబానికి సంబంధించిన అనేక ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. మరి ఇలాంటి బాధ్యతలకు సంబంధించి రిమైండర్‌గా ఉపయోగపడుతూ.. కట్టాల్సిన బిల్లుల వివరాలను గుర్తు చేస్తుంది ఈ అప్లికేషన్. - జీవన్ వంటకూ లోటు లేదు! వంటొచ్చిన మగాడు ధైర్యంగా వంటింట్లోకి చొరబడతాడు. ఆ ధైర్యాన్ని ఇచ్చే అప్లికేషన్లు అనేకం అందుబాటులో ఉన్నాయి! వెజ్, నాన్వె జ్ లలో వేల కొద్ది క్విజిన్లు వండటానికి గైడ్లుగా ఉపయోగపడతాయవి. ఓపిక ఉన్న బ్యాచిలర్ అయినా, సరదాగా ఫ్యామిలీ మెన్ అయినా వీటితో ప్రయోగాలు చేయవచ్చు! ప్రావీణ్యతను చాటుకోవచ్చు! ఎస్ఏఎస్ సర్వైవల్ గైడ్.. ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవడం అనేది మనిషికి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. అయితే కొన్ని విపత్తులు ఎదురయినప్పుడు ఎలాంటి వారికైనా ఎలా స్పందించాలో అర్థం కాకపోవచ్చు. ముంచుకొచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడం కష్టతరం కావొచ్చు. మరి బయటపడటానికి అవకాశం ఉండి.. మార్గం కోసం అన్వేషిస్తున్న సమయంలో ఉపయోగపడేదే ఎస్ఏఎస్ సర్వైవల్ గైడ్. ఫస్ట్‌ఎయిడ్ దగ్గర నుంచి వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, విపత్తులు ఎదురయినప్పుడు ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల గురించి సచిత్ర వివరణ అందిస్తుంది ఈ అప్లికేషన్.. ఆర్ట్ ఆఫ్ మ్యాన్లీనెస్.. మగాడిగా బతికే ఆర్ట్‌ను మరింతగా అలవాటు చేసుకోవాలంటే మీ ఐఫోన్లోనో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందట. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే మగాడిలా వ్యవహరించడం 274 శాతం పెరుగుతుందని అంటున్నాయి ఈ అప్లికేషన్ గణాంకాలు. చిన్న చిన్న సాహసాలు ఎలా చేయాలి అనే విషయాల దగ్గర నుంచి ఒక మ్యాన్ డైనింగ్టేబుల్ దగ్గర ఎలా ప్రవర్తించాలి.. అనే విషయాల దగ్గర వరకూ అనేక వివరణలుంటాయి ఈ అప్లికేషన్లో. -
యురా.. వెంటనే తేరా..
ఉదయాన్నే నిద్ర లేవాలి. లేవగానే.. బెడ్ కాఫీ తాగందే మీరు మంచం నుంచి కిందకు దిగరు. ఇచ్చేవారే లేరు..సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి తిరిగి ఇంటికి వచ్చారు. మీకిష్టమైన మందు లేదా కాక్టైల్ తయారుచేసుకునే ఓపిక లేదు.. కానీ తాగాలని మాత్రం ఉంది. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం.. ‘యురా’. ఒరేయ్ యురా అంటూ ఈ ఎగిరే రోబో బార్‌టెండర్‌కు మీరు వాయిస్ కమాండ్ ఇస్తే.. ఉదయాన్నే నిద్రలేపడమే కాకుండా.. మీకు కావాల్సిన కాఫీని క్షణాల్లో కలిపి ఇచ్చేస్తుంది.. సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగొచ్చి.. ఫ్రెషప్ అయ్యేసరికి మీకిష్టమైన కాక్‌టైల్‌ను రెడీ చేసి పెడుతుంది. ‘యురా’.. ఈ ఎగిరే రోబో బార్టెండర్ డిజైన్ సృష్టికర్త ఉక్రెయిన్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ అర్కిటెక్చర్ విద్యార్థి హెర్మాన్ హేడిన్. ప్రస్తుతం ఈ డిజైన్ 2014 ఎలక్ట్రొలక్స్ డిజైన్ ల్యాబ్ అవార్డుకు పోటీ పడుతోంది. ‘యురా’లో మనకు కావాల్సినవి నింపి పడేస్తే.. మనకు కావాల్సిన టైంలో అది మనకు అవి అందిస్తుంది. గ్లాస్ ముందు పెడితే చాలు.. కాక్టైల్ చేసి, ఇచ్చేస్తుంది. పైగా.. ఇందులో కాఫీని వేడిగా.. మందును చల్లగా ఉంచే సదుపాయమూ ఉంది. అంతేకాదు.. అది ఎంత ఉష్ణోగ్రతలో ఉందన్న విషయాన్ని బయట ఉండే తెరపై ప్రదర్శిస్తుంది. దీంతోపాటు అందులో ఉండే కేలరీలు, కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్ల వివరాలనూ తెలుపుతుంది. ‘యురా’ వైఫై ఆధారంగా వాయిస్ కమాండ్స్‌కు అనుగుణంగా పనిచేస్తుంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఆమెతో బ్రేకప్‌కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
జగన్‌కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement