రూ.3,750 కోట్ల నిధుల వేటలో ఫ్లిప్‌కార్ట్ | Sakshi
Sakshi News home page

రూ.3,750 కోట్ల నిధుల వేటలో ఫ్లిప్‌కార్ట్

Published Wed, Apr 1 2015 1:19 AM

రూ.3,750 కోట్ల నిధుల వేటలో ఫ్లిప్‌కార్ట్ - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ భారీగా నిధుల సమీకరణ యత్నాల్లో ఉందని సమాచారం. ఈ కంపెనీ రూ.3,750 కోట్ల నిధుల సమీకరణ కోసం కొంతమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ విలువ రూ. 71,000-75,000 కోట్ల రేంజ్‌లో ఉందని, ఈ విలువ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. గత ఏడాది జూలైలో ఈకంపెనీ వంద కోట్ల డాలర్లు, డిసెంబర్‌లో 70 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. భారత్‌లో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించిన ఏకైక ఈ కామర్స్ కంపెనీ ఇదే. స్నాప్‌డీల్, అమెజాన్ తదితర సంస్థలతో ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌కు భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇక  ఈఏడాది రూ.50 వేల కోట్ల విక్రయాలు జరపాలని, తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల సంఖ్యను లక్షకు పెంచుకోవాలని  ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement