ఫస్ట్‌ కేసీఆర్‌, సెకండ్‌ హరీష్‌ రావు | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ కేసీఆర్‌, సెకండ్‌ హరీష్‌ రావు

Published Thu, Mar 9 2017 8:28 PM

ఫస్ట్‌ కేసీఆర్‌, సెకండ్‌ హరీష్‌ రావు - Sakshi

హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో పార్టీ శాసనసభాపక్షం (ఎల్పీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల వారీగా సీఎం కేసీఆర్‌ రేటింగ్స్‌ ఇచ్చారు. తాను నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు మేరకు రేటింగ్స్‌ ఇచ్చారు.  (కేసీఆర్‌ సర్వే: టీఆర్‌ఎస్‌ కు ఎన్ని సీట్లంటే?)

ఎమ్మెల్యేలకు ఆయన నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ 101-106 సీట్లు వస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాగా మెదక్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ మొదటి స్థానంలో ఉండగా, మంత్రి హరీశ్‌ రావు రెండో స్థానంలో నిలిచారు. బాబూమోహన్‌ చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకున్నారు.

జిల్లాల వారీగా వస్తే ....
ఖమ్మం జిల్లా: ఫస్ట్‌ తుమ్మల నాగేశ్వరరావు, లాస్ట్‌ మదన్‌ లాల్‌
ఆదిలాబాద్‌ జిల్లా: తొలి స్థానంలో కావేటి సమ్మయ్య, చివరి స్థానంలో బాపురావు
నిజామాబాద్‌ జిల్లా: ప్రథమ స్థానంలో గణేష్‌, మలి స్థానంలో షకీల్‌

వరంగల్‌ జిల్లా: ఫస్ట్‌ ఎర్రబెల్లి దయాకరరావు, లాస్ట్‌ దొంతి మాధవరెడ్డి
కరీంనగర్ జిల్లా‌: ఈటల ఫస్ట్‌, చెన్నమనేని రమేష్‌ లాస్ట్‌
రంగారెడ్డి జిల్లా: తొలి స్థానంలో తీగల కృష్ణారెడ్డి, చివరి స్థానంలో ఆర్‌. కృష్ణయ్య
మహబూబ్‌ నగర్‌ జిల్లా : ఫస్ట్‌ సంపత్‌ కుమార్‌, లాస్ట్‌ రామ్మోహన్‌ రెడ్డి
హైదరాబాద్‌ జిల్లా : బాషా ఖాద్రీ తొలి, రామచంద్రారెడ్డి చివరిస్థానం

Advertisement
Advertisement