మార్చి 5న ముహూర్తం? | Sakshi
Sakshi News home page

మార్చి 5న ముహూర్తం?

Published Sun, Feb 14 2016 1:11 AM

మార్చి 5న ముహూర్తం? - Sakshi

ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్-1 పనులకు శంకుస్థాపన
హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ..?

 
 జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేజ్-1లో భాగంగా నూతనంగా నిర్మించనున్న 8, 9 యూని ట్లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 5న రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానిని కలుసుకుని తెలంగాణ స్టేజ్-1 ప్రారంభానికి హాజరుకావాలని కోరగా, మార్చి మొదటి వారంలో వస్తానని హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 5వ తేదీన ప్రధానమంత్రి పర్యటన ఖరారుకానున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ నెల 13న మోడీ రానున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఇటీవల కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు రామగుండం సందర్శించి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కానీ 13న నరేంద్రమోడీ పర్యటన ఖరారు కాలేదు. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ మేరకు రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు
 
4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ సంస్థ అంగీకరించింది. దానిలో భాగంగా తెలంగాణ స్టేజ్-1లో 2x800=1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు బోర్డు ఆఫ్ డెరైక్టర్లు రూ.10,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. పర్యావరణ అనుమతులు, కోల్‌లింకేజీ, పవర్ పర్చేజ్ ఒప్పందం ఇప్పటికే పూర్తయ్యూరుు. ఈనెల 18న ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌సింగ్ రామగుండలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 5న శంకుస్థాపన చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం పనులను వేగవంతం చేస్తోంది.

Advertisement
Advertisement