ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం

Published Wed, Apr 29 2015 12:54 AM

Fight aganist public problems YSRCP party

- అటకెక్కిన డబుల్ బెడ్ రూమ్ పథకం
- రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి
- వైఎస్సార్ సీపీ  జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్
సంగారెడ్డి క్రైం:
జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ తెలిపారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రైతులకు రుణమాఫీ సక్రమంగా అందకపోవడం, వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు సైతం రాక అనేక మంది రైతులు ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

రైతులకు సంబంధించిన పథకాలు అమలు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రుణమాఫీ, కరెంట్ విషయంలో టీఆర్‌ఎస్ తన మెనిఫెస్టోలో ప్రకటించి నేడు పట్టించుకోకపోడం సరైంది కాదన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ పథకం కింద నిర్మించుకున్న అనేక మంది నిరుపేదలకు ఇప్పటివరకు బిల్లులు రాక అప్పుల పాలయ్యారన్నారు.

ఆత్మహత్యలకు పాల్పడిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకున్న సంఘటన లు లేవని ప్రభుత్వంపై దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చా రు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాల నలో ఏ నాడు కూడా రైతులు నిరసన తెలిపిన సంఘటనలు లేవని గుర్తు చేశా రు. రైతుల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు పథకాలన్నీ విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కిందని అన్నారు. నేడు తెలంగాణాలో కూడా రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో  సత్తా చాటాలి
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో రానున్న గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ పిలుపునిచ్చారు. పటాన్‌చెరు మండల, పట్టణ కార్యవర్గం ఎంపిక కోసం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, నాయకులు వేణు, నారాయణమూర్తి జాబితాను మంగళవారం జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్‌కు సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో అందజేశారు.

ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ, పట్టణ అధ్యక్షులు కలిసి గ్రేటర్‌ప్రాంతంలో ప్రజలతో మమేకమై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ, మండల, పట్టణ కమిటీల నియామకాలు త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. నాడు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతంలో మూత పడ్డ పరిశ్రమలను తెరిపించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

Advertisement
Advertisement