పిస్టోరియస్కు ఆరేళ్లు | Sakshi
Sakshi News home page

పిస్టోరియస్కు ఆరేళ్లు

Published Thu, Jul 7 2016 1:26 AM

పిస్టోరియస్కు ఆరేళ్లు

జైలు శిక్ష విధించిన దక్షిణాఫ్రికా కోర్టు

 ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దక్షిణాఫ్రికా పారా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. రీవా స్టీన్‌కాంప్ హత్య కేసులో ప్రిటోరియా హై కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. నిజానికి దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉన్నా.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పిస్టోరియస్‌కు తక్కువ శిక్షను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా జడ్జి థోకోజిలే మసిపా వ్యాఖ్యానించారు.

పిస్టోరియస్ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడని జడ్జి భావించారు. ఈ కేసులో ఇదే అఖరు తీర్పు కాబోదు. తెల్ల రంగు చొక్కా, నల్లరంగు కోటు వేసుకున్న పిస్టోరియస్ కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి కోర్టుకు వచ్చాడు. ఈ తీర్పుపై పిస్టోరియస్ అప్పీల్‌కు వెళ్లాలని అనుకోవడం లేదని అతని న్యాయ సలహాదారుల బృందం తెలిపింది. 2013 ప్రేమికుల రోజున తన ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడని భావించిన పిస్టోరియస్ బాత్రుమ్ తలుపు వెనుక నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతని ప్రియురాలు రీవా మరణించింది.

Advertisement
Advertisement