పిస్టోరియస్‌కు 13 ఏళ్ల జైలు | Sakshi
Sakshi News home page

పిస్టోరియస్‌కు 13 ఏళ్ల జైలు

Published Sat, Nov 25 2017 12:49 AM

Oscar Pistorius' prison sentence more than doubled to 13 years - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసిన కేసులో దక్షిణాఫ్రికా పారా ఒలింపిక్‌ చాంపియన్‌ ఆస్కార్‌ పిస్టోరియస్‌ శిక్షను రెట్టింపుచేస్తూ ఆ దేశ అప్పీల్స్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గతంలో ఆరేళ్ల జైలు శిక్ష విధించాలని ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్దేశపూర్వకంగానే హత్యచేసినట్లు పేర్కొనటంపై చర్చించిన న్యాయస్థానం 13 ఏళ్ల 5నెలల జైలు శిక్షను విధించింది. ఈ పారా ఒలింపిక్స్‌ అథ్లెట్‌ 2013 వాలెంటైన్స్‌ డే తెల్లవారుజామున తన గర్ల్‌ఫ్రెండ్‌ రీవా స్టీన్‌క్యాంప్‌ను కాల్చిచంపాడు. దొంగగా భావించి చంపినట్లు పిస్టోరియస్‌ పేర్కొన్నా... ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించటంలో విఫలమయ్యాడు.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement