ఈ రోజు సచిన్ కు చాలా ప్రత్యేకం | Sakshi
Sakshi News home page

ఈ రోజు సచిన్ కు చాలా ప్రత్యేకం

Published Sat, Sep 9 2017 3:50 PM

ఈ రోజు సచిన్ కు చాలా ప్రత్యేకం

న్యూఢిల్లీ:క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఘనతలు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతనొక అద్భుతం.. అతను సాధించిన ఘనతలు అద్వితీయం.అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్. ఇందులో వన్డేల్లో 49 సెంచరీ సాధించిన సచిన్.. టెస్టుల్లో 51 శతకాల్ని నమోదు చేశారు. అయితే ఎన్నో రికార్డుల్ని లిఖించిన సచిన్ కు ఈ రోజు(సెప్టెంబర్ 9) చాలా ప్రత్యేకమనే చెప్పాలి. సచిన్ తన కెరీర్ లో తొలి వన్డే సెంచరీ సాధించడమే ఈరోజు ప్రత్యేకత.

1994, సెప్టెంబర్ 9 వ తేదీన ప్రేమదాస స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ తొలి వన్డే శతకాన్ని సాధించారు. 130 బంతుల్లో 110 పరుగులతో సచిన్ తన తొలి వన్డే శతకాన్ని సాధించారు. 1989 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్.. వన్డేల్లో సెంచరీ చేయడానికి ఐదేళ్లు పట్టింది. తన తొలి సెంచరీ చేయడానికి సచిన్ కు 78 వన్డే మ్యాచ్ లు అవసరమయ్యాయి. ఆ సమయానికి సచిన్ 17 హాఫ్ సెంచరీలు సాధించడం ఇక్కడ మరొక విశేషం.

Advertisement
Advertisement