తెలంగాణలో కొత్త బీరు పాలసీ | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త బీరు పాలసీ

Published Fri, Aug 28 2015 7:31 PM

తెలంగాణలో కొత్త బీరు పాలసీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బీరు పాలసీని ప్రవేశపెట్టింది. తెలంగాణ మైక్రో బేవరేజ్ పేరిట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  దీని ప్రకారం రోజుకు వెయ్యి లీటర్లు మించకుండా డ్రాట్ బీర్ తయారు చేసేందుకు వీలుగా లైసెన్సులు ఇవ్వనుంది. బీరు కంపెనీ ఏర్పాటు చేసే వారు స్థానిక సంస్థల నుంచి నోఅబెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ఏడాదికి రూ.3 లక్షల లైసెన్స్ ఫీజుతో కొత్త బేవరేజస్ కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఇక ప్రాంతీయంగా ఎక్కడికక్కడ బీరు తయారీ అయ్యేలా మార్గదర్శకాలు జారీ చేసింది. చౌక మద్యం తెస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. బార్లు సంఖ్య కూడా పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement