ఫొటోగ్రాఫర్లందరికీ ఇళ్ల స్థలాలు | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్లందరికీ ఇళ్ల స్థలాలు

Published Mon, Aug 29 2016 2:13 AM

ఫొటోగ్రాఫర్లందరికీ ఇళ్ల స్థలాలు - Sakshi

దావణగెరె : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతి సదుపాయం కల్పించే ఉద్దేశంతో తగిన ఖాళీ స్థలం కోసం అన్వేషిస్తున్నామని, తగిన స్థలం లభించిన వెంటనే ఫొటోగ్రాఫర్లందరికీ ఆశ్రయ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన నగరంలోని రేణుకా మందిరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆశ్రయ ఇళ్లు కేటాయించే ప్రక్రియను 2002లో నిలిపి వేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా పెరిగిందని, భూమి ధరలు కూడా పెరిగాయన్నారు. అందువల్ల భూముల కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఫొటోగ్రాఫర్ల కుటుం బ సభ్యులకు ప్రత్యేక కేటగిరి కింద స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారని, ఫొటోగ్రాఫర్లకు త్వరలో ఇళ్ల స్థలాలు కల్పిస్తామన్నారు.


నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ఫొటోగ్రాఫర్ లక్షలాది రూపాయలు వెచ్చించి కెమేరాలు కొనుగోలు చేస్తున్నారని, అయితే అం దుకు తగిన సంపాదన లభించడం లేదన్నారు. ఫొటోగ్రాఫర్లకు అన్ని రకా ల సాయం అందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్ బాబణ్ణ ను సన్మానించగా, జిల్లాధికారి డీఎస్ రమేష్, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్ జాధవ్, ఉపాధ్యక్షుడు నాగేష్, జిల్లా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు శికారి శంభు, డీ.శివకుమార్, వివిధోద్దేశ సంఘం జిల్లా అధ్యక్షుడు పాటిల్, దేవరాజ్, అంబాస్, శివణ్ణ, సతీష్ పవార్, శివలింగప్ప, రామచంద్ర, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement