డిసెంబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Wed, Dec 9 2015 10:29 PM

డిసెంబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రతీ అగ్నిహోత్రి (నటి), కామ్నా జెఠ్మలానీ (నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖం, ఆనందం, నూతన ఉత్సాహం, స్వయం వికాసంతో ఉల్లాసంగా ఉంటారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. వీరి పుట్టిన తేదీ 10.

ఇది సూర్యసంఖ్య కాబట్టి వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలుంటాయి. కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3, 5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, రెడ్, ఆరంజ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. తండ్రిని, తత్సమానులను ఆదరించడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
 
Advertisement
 
Advertisement