అకస్మాత్తుగా మెలకువ వస్తోంది..?
నా వయస్సు 78 ఏళ్లు. ఇంతకు ముందులాగా గాఢనిద్ర పట్టడం లేదు. అర్ధరాత్రుళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను. చాలాసేపు నిద్రపట్టక అలాగే కూర్చుంటున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
- రాఘవేంద్రప్రసాద్, గుంటూరు
నిజానికి చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే వ్యవధి తగ్గుతుంది. అయితే మీరు అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నారని చెబుతున్నారు. బహుశా దీనికి కారణం మీలోని అంతర్గత మానసిక ఆందోళన కావచ్చు. ఇక మీ వయసు 78 ఏళ్లు అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించుకోండి. ఒక్కోసారి అధిక రక్తపోటు (హైబీపీ), సెరిబ్రల్ సర్క్యులేషన్ (మెదడుకు రక్తప్రసరణ) సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యనిపుణులకు చూపించండి.
నాకు 28 ఏళ్లు. తరచూ వెన్నెముక, నడుం భాగాల్లో నొప్పి వస్తోంది. నోట్లో పెదవులపై, దవడలపై, నాలుక కింది భాగంలో తరచూ పొక్కులు వస్తున్నాయి. ఎప్పుడూ జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటోంది. నా సమస్యకు కారణం ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి.
- ఎల్. దొరబాబు, మచిలీపట్నం
మీరు వివరించిన లక్షణాలను బట్టి ప్రధానంగా మీ కీళ్లనొప్పులు, వెన్నెముక, మెడ, తుంటి భాగాల్లో ఉండటం, పెదవులపైనా, దవడలపైనా పొక్కులు, జ్వరంగా ఉండటం వంటివి చూస్తుంటే... మీకు కీళ్లవాతం (సీరోనెగెటివ్ ఆర్థోపతి) వంటి వ్యాధులు ఉండవచ్చునేమో అనిపిస్తోంది. ఇక కొన్ని సందర్భాల్లో విటమిన్ బి-12 లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మీరు దీనికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్-బి 12 లోపాలు లేవని నిర్ధారణ అయి, మీకు కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే దానికి తగిన మందులు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఉన్న సమయంలోనూ మీరు చెబుతున్న లక్షణాలు బాగా తీవ్రమవుతుంటాయి. కాబట్టి మీకు అలాంటి ఒత్తిళ్లు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుగొని ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించడానికి యోగా వంటి మార్గాలను అనుసరించండి. మీరు ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
Published Mon, Jul 6 2015 10:47 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం
12, 13 తేదీల్లో మద్యం బంద్
No Headline
ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్
‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ
ఓటుహక్కు వినియోగించుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం తగదు
ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరిట మోసం
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement