‘సమైక్య’ దీక్షలు | Sakshi
Sakshi News home page

‘సమైక్య’ దీక్షలు

Published Wed, Jan 8 2014 1:41 AM

‘సమైక్య’ దీక్షలు - Sakshi

 బొబ్బిలి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు విభజనను వ్యతి రేకిస్తూ.. రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని నినదించారు. బొబ్బిలి పట్టణంలో మొదటి రోజు సుమారు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. పట్టణానికి చెందిన 4, 5 వార్డులతో పాటు గొల్లపల్లి గ్రామస్తులు శిబిరంలో కూర్చున్నారు. వారికి ఆ పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు, అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకు లు సుజయ్, సాంబశివరాజు మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకూ పోరాటాన్ని ఆపేది లేదన్నా రు.
 
 నెల్లిమర్లలో చేపట్టిన దీక్షలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, సింగుబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనరు తూముల రాంసుధీర్, మాజీ కౌన్సిలర్లు, వార్డుస్థాయి నాయకులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద  యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్,  శిరువురి పార్వతి, రాంబార్కి సత్యం, గండికోట శాంతి, బుగత ముత్యాలమ్మ, తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద డాక్టర్ పెద్దినాయుడు, మక్కువ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా శిబిరానికి పార్టీ జిల్లా కన్వీనరు సాం బశివరాజు సంఘీభావం తెలిప ారు. 
 
 అలాగే బీఎస్‌ఆర్ ఆస్పత్రి ముందు సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. ఎస్. కోటలో జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ రెహ్మాన్, పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు కోళ్ల గంగాభవాని ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. చీపురుపల్లిలో సమన్వయకర్త మీసా ల వరహాలనాయుడు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల కన్వీనర్లు మీసాల అప్పలనాయుడు, సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, కెల్ల సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.సాలూరులో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, రాష్ర్ట మహిళా సభ్యురా  లు ముగడ గంగమ్మ, మంచాల వెంకటరమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.  
 

Advertisement
Advertisement