దొంగల్ని పట్టుకునేందుకు వెళుతూ ఎస్‌ఐ మృతి | Sakshi
Sakshi News home page

దొంగల్ని పట్టుకునేందుకు వెళుతూ ఎస్‌ఐ మృతి

Published Sun, Jan 15 2017 12:53 PM

SI dies in road accident

కడప : విధి నిర్వహణలో భాగంగా గొలుసు దొంగలను పట్టుకునేందుకు వెళుతున‍్న కడప సీసీఎస్‌ సెంట్రల్‌ క్రైం పోలీస్‌ స‍్టేషన్‌కు చెందిన ఎస్ఐ నాగన‍్న ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నడుచుకుంటూ వెళుతున‍్న నాగన‍్నను ఎదురుగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని చికిత్స నిమిత్తం రిమ్స్‌ రిమ్‌స్‌ ఆస‍్పత్రికి తరలించగా అక‍్కడ చికిత‍్సపొందుతూ మృతి చెందాడు. నాగన‍్నకు భార‍్య ముగ్గురు పిల‍్లలు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement