
ట్వీటర్‌లో పవన్‌కల్యాణ్ మరో రాజకీయ వ్యాఖ్య
రాజధాని భూసేకరణ విషయంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం తన ట్వీటర్ ఖాతా ద్వారా మరోసారి స్పందించారు.
సాక్షి, హైదరాబాద్: రాజధాని భూసేకరణ విషయంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం తన ట్వీటర్ ఖాతా ద్వారా మరోసారి స్పందించారు. ‘మీడియాలో వార్తల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఆ ఉద్దేశంతో ముందుకెళితే మటుకు నేను రైతులకు అండగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ ట్వీట్ చేశారు.