గిన్నిస్ పుటల్లో భక్తాంజనేయ లడ్డూ | Sakshi
Sakshi News home page

గిన్నిస్ పుటల్లో భక్తాంజనేయ లడ్డూ

Published Sat, Nov 1 2014 2:12 AM

గిన్నిస్ పుటల్లో భక్తాంజనేయ లడ్డూ - Sakshi

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీ భక్తాం జనేయ స్వీట్స్ సంస్థ భారీ లడ్డూ తయారీతో వరుసగా నాలుగో ఏడాది గిన్నిస్ రికార్డు సాధించింది.  2011 వినాయకచవితికి తయారు చేసిన 5,570 కేజీల లడ్డూతో శ్రీభక్తాంజనేయ స్వీట్స్ తొలిసారిగా గిన్నిస్ పుటలకెక్కింది.

2012లో రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆర్డరుపై తయారు చేసిన 6,599.29 కేజీల లడ్డూ, 2013లో అదే కమిటీ కోసం చేసిన 7,132.87 కేజీల లడ్డూలు గిన్నిస్ సాధించాయి. ఇక ఈ ఏడాది విశాఖలోని గాజువాకలో నెలకొల్పిన గణనాథుని చెంత ఉంచేందుకు తయారు చేసిన 7,858 కిలోల లడ్డూ కూడా గిన్నిస్ రికార్డుల పుస్తకంలో నమోదైంది. ఈ సర్టిఫికెట్ శుక్రవారం యజమాని వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు)కు అందింది.    

Advertisement
Advertisement