ఇంటి నుంచే ఓటేశారు.. | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే ఓటేశారు..

Published Sat, May 4 2024 7:35 AM

ఇంటి

నీటి కష్టాలు తీరేదెన్నడు..?
కడెం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలను నీటి కష్టాలు వెంటాడుతున్నా యి. మిషన్‌ భగీరథ పథకం ఇక్కడ మాత్రం జాడలేదు.

వాతావరణం

ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. వేడిగాలులు వీస్తాయి. ఉదయం నుంచే వేడి అధికంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి.

IIIలోu

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఈసారి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం ఈమేరు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ కార్యక్రమాన్ని ఎన్నికల సిబ్బంది శుక్రవారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఫామ్‌ 12డీ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటికి వెళ్లి వారి సంతకాలు, వేలి ముద్రలు సేకరించి ఇంట్లోనే రహస్యంగా ఓటు వేయించారు. భైంసాటౌన్‌ పట్టణంలోని పురాణబజార్‌కు చెందిన శతాధిక వృద్ధురాలు చివాటే అన్నపూర్ణబాయి(104) అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోగా, ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలోనూ శుక్రవారం పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఇంటి నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుంటాల మండలంలో శతాధిక వృద్ధులు లసుంబాయి, లింబగిరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

/భైంసాటౌన్‌/కుంటాల

నిర్మల్‌లో ఓటేస్తున్న వృద్ధురాలు

ఇంటి నుంచే ఓటేశారు..
1/3

ఇంటి నుంచే ఓటేశారు..

ఇంటి నుంచే ఓటేశారు..
2/3

ఇంటి నుంచే ఓటేశారు..

ఇంటి నుంచే ఓటేశారు..
3/3

ఇంటి నుంచే ఓటేశారు..

Advertisement
 
Advertisement