amp pages | Sakshi

రాజంపేట: ఆంధ్ర.....

Published on Thu, 03/30/2023 - 01:12

రాజంపేట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైన తర్వాత రాములోరి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలానికి దీటుగా ఒంటిమిట్ట రామాలయాన్ని తీర్చిదిద్దారు. ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 5న రాములోరి కల్యాణం కనుల పండువగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామాలయంపై ప్రత్యేక కథనం.

త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం..

త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారు. అప్పుడు సీతమ్మకు దాహం వేసింది. రాముడు బాణం సంధించి భూమి లోకి వదిలాడు. నీరు పైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తానూ ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలను నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నారు.

ధర్మసంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి..

బుక్కరాయలు కోదండరామాలయం నిర్మించాడు. రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార చీరలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయల తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెల్ని తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకార కుడ్యాలు సమున్నతమైన గోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్ప విన్యాసాలు కనిపిస్తాయి.

ఏకశిలానగరంగా..

ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మించారు. జాంబవంతుడు ముగ్గురిని ఒకే శిలలో భావించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేలా నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలువైన ఏకశిలా విగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన.

ఒంటిమిట్ట కవులు..అపరభక్తులు..

ఒంటిమిట్ట కోదండరాముని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకటకవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.. మాలఓబన్న, ఇమామ్‌బేగ్‌ లాంటి ఎందరో అపర భక్తరామదాసులు స్వామివారిని సేవించి తరించిపోయారు.

బ్రహ్మోత్సవ వివరాలు

మార్చి 30 న వ్యాసాభిషేకం, సాయంత్రం అంకురార్పణ

31న ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, రాత్రికి శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం

ఏప్రిల్‌ 01న వేణుగానాలంకారం, రాత్రికి హంసవాహనంపై ఊరేగింపు

02న వటపత్రసాయి అలంకారం, రాత్రికి సింహవాహనంపై భక్తులకు దర్శనం

03న నవనీత కృష్ణాలంకారం, రాత్రికి హనుమంతసేవ

04న మోహినీ అలంకారం, రాత్రి గరుడ సేవలో కోదండరాముడు

05న శివధనురాణాలంకారం, రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం పండువెన్నెలలో 8గంటల నుంచి 10గంటలలోపు సీతారాముల కల్యాణం

06న రథోత్సవం

07న కాళీయమర్ధనాలంకారం, రాత్రికి అశ్వవాహనం

08న చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

09న రాత్రి పుష్పయాగం, ఏకాంతసేవలో కోదండరాముడు

జాంబవంతుడు ప్రతిష్టించిన రామక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం

త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసమే ఏకశిలానగరం

ఆంజనేయడు లేకపోవడమే ఆలయ ముఖ్య విశేషం

వంటడు..మిట్టడుతో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)