amp pages | Sakshi

రైతుకు చేయూత

Published on Tue, 11/03/2020 - 02:31

సాక్షి, రంగారెడ్డి: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు స్వతహాగా కొనుగోలు చేయలేని రైతుల కోసం మండలానికో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్‌ ధరలో దాదాపు 50 శాతానికి.. సన్న, చిన్న కారు రైతులకు మార్కెట్‌ ధరలో కొంచెం తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) నిధులతో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను సెర్ప్‌ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి 31 సీహెచ్‌సీలు రాగా.. 29 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున గ్రాంట్‌ మంజూరయ్యాయి. హైదరాబాద్‌ మినహా జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.  

మహిళలే నిర్వాహకులు.. 
వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సంఘాల్లోని సభ్యులే ఈ సీహెచ్‌సీల నిర్వాహకు లు. ఇలా ఒక మండలంలోని మహిళా రైతులంతా కలసి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూ ప్‌ (ఎఫ్‌పీజీ)గా ఏర్పడతారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన 31 మండలాల్లోని ఎఫ్‌పీజీలకు.. సీహెచ్‌సీ ఏర్పాటుకు కావాల్సిన కేంద్ర గ్రాంట్‌ అందింది. ఈ నిధులతో స్థానిక వ్యవసాయ పంటలకు కావాల్సిన పరికరాలు, పనిముట్లను కొనుగోలు చేసి కేంద్రాలను వినియోగంలోకి తెస్తున్నారు.  

అందుబాటులో ఉన్న పనిముట్లు.. 
ట్రాక్టర్, కల్టివేటర్, పవర్‌ వీడర్, పవర్‌ టిల్ల ర్, టార్పాలిన్లు, పవర్‌ స్ప్రేయర్స్, సోయింగ్‌ అండ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్లర్‌ ట్రాక్టర్‌ ఆపరేటర్‌ తదితర పనిముట్లు, పరికరాలు కస్టమ్‌ హైరిం గ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ మినహా 29 జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో మాత్రం మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం శక్తికి మించి భారం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రైతులే 80 శాతం మంది ఉన్నారు. వీరికి యాంత్రీకరణను చేరువ చేయడంలో సీహెచ్‌సీలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. అలాగే పెట్టుబడులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అధిక విస్తీర్ణంలో పంటల సాగు కూడా సులభం కానుంది.  

నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. 
సీహెచ్‌సీలకు మంచి స్పందన లభిస్తుండటంతో వీటి సేవలు విస్తరించాలన్న డిమాండ్‌ వస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నారు. పట్టణ ప్రాంత సెగ్మెంట్లు మినహా.. గ్రామీణంలో ఉన్న సుమారు 75 నియోజకవర్గాల్లో త్వరలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 31 సెగ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటయ్యే సీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ లభించదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పరికరాలు, పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయంలోంచి రుణాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను చూసుకోవాలి. 

రైతులకు ఎంతో మేలు.. 
సీహెచ్‌సీలతో పేద, మధ్య తరగతి రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మహిళా సంఘాల ద్వారా మా వంతు సహకారం అందించనున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అధికంగా వ్యవసాయం చేసే మూడు గ్రామాలను గుర్తించి యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశాం. ఫోన్‌ నంబర్లు ఇచ్చి ఒక సీసీతో పాటు అకౌంటెంట్‌ను పర్యవేక్షణకు నియమిస్తున్నాం. బయటి కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నాం.  
– వట్నాల శ్యామల, రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)