amp pages | Sakshi

Telangana: కొనేవరకు కొట్లాట..

Published on Sat, 11/13/2021 - 02:23

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో అధికార టీఆర్‌ఎస్‌ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా చేపట్టిన మహాధర్నాలో వేలాది మంది రైతులతో కలిసి పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మం త్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ధర్నా వేదికలు గులాబీమయం అయ్యా యి. రాష్ట్ర అవతరణ తర్వాత అధికార పార్టీగా చేపట్టిన తొలి నిరసన కార్యక్రమం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యంత్రాంగం సవాలుగా తీసుకుంది. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌  పిలుపు మేరకు జరిగిన మహాధర్నాలో భాగంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు.



సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వైద్య, ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మంత్రు లు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ, ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రావు   తమ జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలి పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాదయాత్రగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎడ్లబండి మీద ర్యాలీగా వచ్చారు. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాకు సంఘీభావం తెలుపుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ మహాధర్నా చేపట్టింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరి కంకులు, ధాన్యం సంచులను ధర్నా వేదిక వద్ద ప్రదర్శించారు.  



యాసంగి వడ్లు కొనేవరకు ఉద్యమ తరహాలో కేంద్రం పై కొట్లాడతామని ధర్నాల్లో పాల్గొన్న నేతలు చెప్పారు. ‘పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు శుక్రవారం జరిగిన మహాధర్నాలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించింది. ఉద్యమ కాలం నాటి జోష్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో కనిపించింది..’అని సిరిసిల్లలో జరిగిన ధర్నాలో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని ఈ నెలాఖరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.   



ధాన్యం కొల్లగొట్టేందుకు కుట్రలు     
పంటను కేంద్రం కొనకుండా, అంబానీ, అదానీలు వచ్చి తక్కువ ధరకే కొల్లగొట్టే కుట్రలకు బీజేపీ జాతీయ నేతలు తెరలేపారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. అవసరమైతే మోదీ, పీయూష్‌ గోయల్, కిషన్‌రెడ్డి ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఊర్లోకి వచ్చే బీజేపీ నాయకుల్ని వేసంగి వడ్లు కొంటరా? లేదా? అని రైతులు నిలదీయాలి.     
– కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ 

అంబానీ, అదానీలపైనే ప్రేమ 
బీజేపీకి రైతులన్నా, వ్యవసాయమన్నా ప్రేమ లేదు. అదాని, అంబానీలపైనే ప్రేమ ఉంది. అందుకే ధాన్యం కొనకుండా కేంద్రం వివక్ష చూపుతోంది. తెలంగాణ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. తొండి సంజయ్‌ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం.     – ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ 

రైతులతో పెట్టుకుంటే నాశనమే 
యాసంగి వరి ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం విస్మరిస్తోంది. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నాశనం అవుతుంది. డ్రామాలు ఆడుతున్న బీజేపీకి త్వరలో సినిమా చూపిస్తాం.      – హైదరాబాద్‌లో మంత్రి తలసాని 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)