amp pages | Sakshi

58 శాతంకన్నా ఎక్కువ డ్రా చేయొద్దు 

Published on Fri, 11/12/2021 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పునర్విభజన చట్టం మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఐడీసీఎల్‌) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను డ్రా చేసుకుంటోందంటూ తెలంగాణ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఐడీసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఏపీకి రావాల్సిన 58 శాతంకన్నా ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకోరాదని ఆదేశించింది.

ఉమ్మడి కార్పొరేషన్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఏపీకి రావాల్సిన 58 శాతంకన్నా ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకుంటున్నారంటూ టీఎస్‌ఐడీసీఎల్‌ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీఐడీసీఎల్‌ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఈ తీర్పు ప్రకారం ఉమ్మడి సంస్థల నిధులను 58, 42 శాతం నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉందన్నారు. 58 శాతానికి మించి ఏపీఐడీసీఎల్‌ డ్రా చేసుకోదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐడీసీఎల్‌ చైర్మన్‌/ఎండీ, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐలను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కు వాయిదా వేసింది.   

Videos

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)