amp pages | Sakshi

హైదరాబాద్‌లో ఆటో కావాలా? రెండు లక్షలు అదనం తప్పదు! బతుకులు ‘తుక్కు’

Published on Sun, 08/14/2022 - 04:13

సాక్షి, హైదరాబాద్‌:  ఇటీవల తమ గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన సాంబయ్య ఉపాధి కోసం ఆటో నడుపుకోవాలనుకున్నాడు. షోరూమ్‌లో కొత్త ఆటో ధర రూ.2.35 లక్షలే. కానీ ఆటో బయటికి వచ్చి రోడ్డుపై తిప్పుకునేందుకు రూ.4.20 లక్షలకుపైనే ఖర్చయింది. ఇదెలా అని ఆశ్చర్యపోవద్దు. హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి ఉంది. ఒక పాత ఆటో తుక్కుకు వెళ్తేగానీ.. కొత్త ఆటో రోడ్డెక్కడానికి వీల్లేదు.

పెద్ద సంఖ్యలో పాత, పాడైపోయిన ఆటోల పర్మిట్లను చేజిక్కించుకున్న కొందరు.. ఆ పర్మిట్లను అడ్డుపెట్టుకుని కొత్త ఆటో కావాల్సిన వారి నుంచి ముక్కుపిండి వసూ­లు చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ముసుగులో ‘పర్మిట్ల’ దందాకు పాల్పడుతున్నారు. వారి ప్రమేయం లేకుండా ఒక్క కొత్త ఆటో కూడా రోడ్డెక్కని పరిస్థితి. అధికారులకు ఇదంతా తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ట్రాఫిక్‌ సమస్య లేకుండా పరిమితితో..
రోడ్ల సామర్థ్యానికి మించి ఆటోలు బయటికి వస్తే ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి విధించింది. ఎవరంటే వారు ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే తిరుగుతున్న ఆటోలు తుక్కు (స్క్రాప్‌) కింద మారితే ఆ స్థానంలో కొత్త ఆటోలు రోడ్డెక్కడానికి అనుమతి ఉంటుంది. అయితే ఎవరైనా పాత ఆటో ఉన్నవారు. దానిని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కు కింద మార్చేస్తే.. వారికి కొత్త ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి పర్మిషన్‌ ఇస్తారు. దీనినే కొందరు దందాగా మార్చుకున్నారు. 

ఏం చేస్తున్నారు? 
ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల వరకు ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో 30 శాతం మాత్రమే యజమానుల చేతుల్లో ఉన్నాయి. మిగతావన్నీ కొందరు వ్యక్తులు, ఫైనాన్షియర్ల చేతుల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తవారు ఆటో కొనాలంటే.. ముందుగా ఓ పాత, తుక్కు దశకు చేరిన ఆటోను వారి పేరిట మార్చుతున్నారు. తర్వాత దాన్ని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కుగా చేసి, ఈ పర్మిట్‌ను కొత్త ఆటోకు వచ్చేలా చేస్తున్నారు. ఇలా పాత ఆటో పర్మిట్‌ను ఇచ్చేందుకు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా పాత పర్మిట్, కొత్త ఆటో కలిసి నాలుగున్నర లక్షలదాకా చేరుతోంది. అంటే ఓ చిన్న కారు ధరతో సమానంగా మారుతోంది. 

కరోనా కష్టకాలంలో ‘పర్మిట్లు’ పట్టేసుకుని 
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్లు, ఇతర పరిణామాలతో బడుగుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఆటోలు నడుపుకొనే వారి ఉపాధికి దెబ్బతగిలింది. ఆదాయం లేకపోవడం ఓవైపు.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారినపడటమో, ఇతర అవసరాలతోనో డబ్బులు అవసరం పడటం మరోవైపు కలిసి.. చాలా మంది ఆటోలను అమ్ముకున్నారు.

కొందరు ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని పాత, తుక్కు దశకు చేరుకున్న ఆటోలను తక్కువ ధరకు పెద్ద సంఖ్యలో కొనేసి పెట్టుకున్నా­రు. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో మళ్లీ ఆటో­లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడా పాత ఆటోల పర్మిట్లను అడ్డుపెట్టుకు­నిదందా కొనసాగిస్తున్నారు. డిమాండ్‌ పెరిగిన కొద్దీ ‘పర్మిట్ల’ రేట్లు పెంచేస్తున్నారు. 

ఫైనాన్స్‌ కట్టలేని వారి నుంచి.. 
హైదరాబాద్‌ నగరంలో ఆటో­లకు ప్రైవేటుగా ఫైనాన్స్‌ చేసే వ్యక్తులు సుమారు 310 మందిదాకా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తిరుగుతున్న మొత్తం ఆటోల్లో 70   శాతం వరకు వీరు ఆర్థిక సాయం చేసినవే. ఈ అప్పులపై విపరీతంగా వడ్డీ ఉంటుంది. ఆటో సరిగా నడవక, తగిన ఆదాయం రాక, ఇల్లు గడవడానికి సంపాదన సరిపోక చాలా మంది రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం లేదు. అలాంటి ఆటోలను ఫైనాన్షియర్లు లాగేసుకుంటున్నారు. వాటిని అద్దెకు ఇచ్చినంత కాలం ఇచ్చి.. డొక్కుగా మారాక ‘పర్మిట్ల’ దందా కోసం వాడుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రవాణా శాఖ సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. 

వెంటనే చర్యలు చేపట్టాలి 
ఆటో పర్మిట్ల విక్రయం దందా తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియర్లు అక్రమ దందా చేస్తున్నారు. ఇటీవల ఇది మరింత తీవ్రమైనా చూసీచూడనట్టు ఉంటుండటం అనుమానాలకు తావిస్తోంది. బడుగుల జేబులను కొల్లగొడుతున్న ఈ దందాను అరికట్టాల్సి ఉంది 
– దయానంద్, తెలంగాణ ఆటోమోటార్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి   

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)