amp pages | Sakshi

Night Sleep: 10–11 గంటల మధ్యే ఉత్తమం

Published on Sat, 11/13/2021 - 04:13

సాక్షి, హైదరాబాద్‌: రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతున్నారా? మరీ 11, 12 గంటలు కూడా దాటిపోతోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఈ అలవాటును మార్చుకోవాల్సిందే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికమైనట్లు వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. రోజూ రాత్రి 10–11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ అలవాటుతో గుండె జబ్బులను చాలావరకు దూరం పెట్టొచ్చునని అంటున్నారు.

రాత్రి 10 గంటలకు ముందు 11 గంటల తర్వాత నిద్రించే వారిలో గుండె జబ్బులు, ఇతర సమస్యలు పెరుగుతున్నట్టుగా ఓ తాజా అధ్యయనం తేల్చింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌ బిజినెస్‌ స్కూల్‌లో అంతర్భాగంగా ఉన్న ‘ద ఇనిషియేటివ్‌ ఇన్‌ డిజిటల్‌ ఎకానమీ ఎట్‌ ఎక్సెటెర్‌ (ఇండెక్స్‌), వివిధ దేశాల్లోని పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి.  

శరీరంలో గడియారం! 
మన శరీరంలో అంతర్గతంగా  24 గంటల గడియారం (సిర్కాడియన్‌ రిథమ్‌) పనిచేస్తుందని, అది శారీరక, మానసిక పనితీరు క్రమబద్ధీకరణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనిని బట్టి రాత్రి 10–11 గంటల మధ్యకాకుండా ఇతర సమయాల్లో నిద్రకు ఉపక్రమిస్తే ఈ శరీర గడియారం సరిగా పనిచేయక గుండె సంబంధిత ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 90 వేల మందికి సంబంధించిన సమాచారం, వివరాలు ప్రాతిపదికన ఈ  పరిశీలన నిర్వహించారు.

వారం రోజుల పాటు వారు నిద్రించిన, మేల్కొన్న సమయాలను వారి ముంజేతిపై ఉండే అక్సిలరోమీటర్‌ (రిస్ట్‌వార్న్‌ అక్సిలరోమీటర్‌) ఆధారంగా పర్యవేక్షించారు. వివిధ సామాజిక నేపథ్యాలు, జీవనశైలి, ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు, తదితర అంశాలతో కూడిన ప్రశ్నల ఆధారంగా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. దీనితో  పాటు గుండె జబ్బులను గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అవలంబించడంతో పాటు, గుండెపోటు, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక గుండెజబ్బు, తదితర అంశాలను పరిశీలించారు.

ఈ క్రమంలో రాత్రి 10 నుంచి 10.59 నిమిషాల మధ్యలో నిద్రపోని వారిలో అత్యధికంగా గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం హెచ్చుస్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా వయసు, లింగం, నిద్రపోయే కాలం, నిద్రలో అవాంతరాలు, మధ్యలో లేవడం, త్వరగా నిద్రపోవడం, రాత్రంతా గుడ్లగూబలా మేల్కొనడం, పొగతాగే అలవాటు, బాడీ మాస్‌ ఇండెక్స్, డయాబెటీస్, రక్తంలో కొలస్టరాల్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నిద్రకు ఉపక్రమణ– గుండె సంబంధిత పని విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

25 శాతం అధికం 
రాత్రి 10–11 మధ్యలో నిద్రపోయే వారితో పోల్చితే ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే వారిలో వివిధ గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్‌ డిసీజెస్‌) గురయ్యే అవకాశం 25 శాతం అధికంగా ఉండే ప్రమాదం. 
రాత్రి 11–12 మధ్యలో నిద్రపోయే వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదంలో 12 శాతం పెరుగుదల 
రాత్రి 10 గంటల లోపు పడుకునే వారిలోనూ 24 శాతం అధికంగా గుండెజబ్బులు పెరిగే అవకాశం 
మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికం 
రాత్రి 10 గంటలోపు నిద్రపోయే పురుషుల్లోనూ ఇది గణనీయంగానే ఉంది. 
అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం మరింత ప్రమాదకరం. ఉదయమే సూర్యకాంతిని చూడడం వల్ల శరీర గడియారం ‘రీ సెట్‌’ అయ్యే అవకాశాలుండగా, అది చూడలేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం. 

మరణాలు నిర్ధారణ కాలేదు 
అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర వల్ల తీవ్రమైన గుండెజబ్బులువచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైందే తప్ప దాని వల్ల మరణాలు సంభవిస్తాయనేది నిర్ధారణ కాలేదని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన సీనియర్‌ లెక్చరర్‌ డాక్టర్‌ డేవిడ్‌ ప్లాన్స్‌ స్పష్టం చేశారు.    

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)