ఓయూలో 14 నుంచి సెల్ట్‌ తరగతులు

Published on Fri, 02/04/2022 - 12:48

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రెనింగ్‌ సెంటర్‌ (సెల్ట్‌)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్‌ డాక్టర్‌ సవీన్‌ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.  

న్యాయశాస్త్రం పీహెచ్‌డీ ఫలితాలు విడుదల 
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్‌డీ కోర్సుల  ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్‌డీ కోర్సుల పార్టువన్‌ (కోర్సు వర్క్‌) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.  

ఓయూ ఎల్‌ఎల్‌బీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు 
ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ రీవాల్యుయేషన్‌ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్‌ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్‌సైట్లో చూడవచ్చు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ