amp pages | Sakshi

గౌడ ఆత్మగౌరవ భవనంలో అందరికీ ప్రాతినిధ్యం

Published on Sat, 07/23/2022 - 01:58

సాక్షి, హైదరాబాద్‌: గౌడ ఆత్మగౌరవ భవ­నంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో గౌడ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కులాల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో విలువైన భూములు కేటాయించారన్నారు.

అందులో భాగంగా గౌడ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఆత్మగౌరవ భవన నిర్మాణంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని గతంలో గౌడ సంఘాల సమన్వయ సమావేశంలో స్పష్టం చేశామన్నారు. ఇందులో ఎలాంటి అపోహలు నమ్మొద్దని వివిధ గౌడ సంఘాల ప్రతినిధులకు, మేధావులకు, గీత వృత్తిదారులకు, నాయకులకు ఈ సందర్భంగా సూచించారు. సంతకాలు లేకుండా సోషల్‌ మీడియా ప్రచారంలో పెట్టిన ట్రస్ట్‌/సొసైటీ నకిలీ డాక్యుమెంట్లు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు కావని, గౌడలు ఐక్యంగా ఉండాలని శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.    

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)