amp pages | Sakshi

Hyderabad: పెళ్లి వేడుకలో సంతోషంగా.. ఉన్నట్టుండి కుప్పకూలడంతో

Published on Thu, 02/23/2023 - 14:57

ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఓ వ్యక్తి  ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వివరాలు.. పాతబస్తిలోని కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని వరుడిని ముస్తాబు చేస్తన్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలాడు. వెంటనే గమనించిన బంధువులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్థారించారు. 

ఊహించని ఘటనలో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. రబ్బాని మరణంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్స్ సైతం భయందోళనలకు గురవుతున్నారు. 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)