amp pages | Sakshi

రూపాయి డౌన్‌, అబద్ధాలు అప్‌.. రూపాయి పతనంపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

Published on Sat, 09/24/2022 - 03:45

సాక్షి, హైదరాబాద్‌: డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రూపాయి విలువ ఎన్నడూ లేనంత దిగజారింది. కానీ అబద్ధాలు మాత్రం ఎన్నడూ లేనంతగా పెరిగా యి. రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం రేషన్‌ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోను వెతకడంలో తీరిక లేకుండా ఉన్నారు.

రూపాయి తన సహజ మార్గంలో వెళ్తోందని, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలన్నీ దేవుడి లీలలు అని మీకు చెప్తారు. విశ్వగురు వర్ధిల్లాలి అని నినదించమంటారు’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘రూపాయి విలువను ప్రపంచ మార్కెట్లు, ఫెడ్‌ రేట్లు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి అంటూ జ్ఞానా న్ని అందజేస్తున్న భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

విశ్వగురు మోదీ మీ వాదనను అంగీకరించరు. ఆయన జ్ఞాన సంపదలోని కొన్ని ఆణిముత్యాలను మీ దృష్టికి తెస్తున్నా. ‘కేంద్రంలో అవినీతి పెరగడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. రూపా యి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంది’ అంటూ 2013లో గుజరాత్‌ సీఎంగా మోదీ నాటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్లను పదుల సంఖ్యలో కేటీఆర్‌ తన వ్యాఖ్యలకు జోడించారు. 

ప్రభుత్వ పనితీరుకు మన్ననలు.. 
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట పండటంపై పంచాయతీరాజ్‌ మంత్రి దయాకర్‌రావును మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాష్ట్రంలోని 12,769 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక ‘పల్లె ప్రగతి’ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినా తమ ప్రభుత్వ పనితీరు అనేక మంది మన్ననలు పొందుతూ, మనసు చూరగొంటోందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతుబీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,450 కోట్లు విడుదల చేయడంపై స్పందిస్తూ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే రైతులకు జీవిత బీమా చేస్తోందని, ఇప్పటివరకు రైతు బీమా ద్వారా 85 వేల మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించిందన్నారు. ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు వర్తించేలా రూ. 1,450 కోట్లు ప్రీమియంగా చెల్లించామన్నారు. 

సెర్బియా సదస్సుకు ఆహ్వానం... 
అక్టోబర్‌ 20న సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగే ‘బయోటెక్‌ ఫ్యూచర్‌ ఫోరమ్‌’సదస్సుకు హాజరు కావాలంటూ సెర్బియా ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ సెర్బియా ప్రధాని అనా బ్న్రాబిక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రత్యేకించి బయో టెక్నాలజీ రంగంలో తెలంగాణ సామర్థ్యానికి ఈ ఆహ్వానాన్ని గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)