amp pages | Sakshi

‘వైన్‌షాప్‌ ఉండాలా.. వద్దా’ అంటూ ఓటింగ్‌.. ఫలితం ఏంటంటే!

Published on Mon, 02/14/2022 - 05:13

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ఓటింగ్‌ను నాయకులను ఎన్నుకునేందుకు చేపడతారు. అయితే  బేగంపేట గురుమూర్తిలేన్‌ ప్రాంతంలో మాత్రం వైన్‌ షాప్‌ ఉండాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్‌ నిర్వహించారు. గుర్తిమూర్తిలేన్‌లో వైన్‌షాపు ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపును ఏర్పాటుచేశామని నిర్వాహకులు చెప్పారు. అయితే దీనిపై ఓటింగ్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

గతంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సెప్షన్‌ స్టడీస్‌కు అనుబంధంగా ఉన్న ‘హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌’ సంస్థను పలువురు స్థానికులు ఆశ్రయించారు. సదరు సంస్థ ప్రతినిధులు శనివారం సిటిజన్‌ రెఫరెండమ్‌ పేరుతో గుర్తిమూర్తి లేన్‌ నివాస, వాణిజ్య కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్‌ నిర్వహించారు. ‘మీకు మీ ఏరియాలో వైన్‌ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 1479 మంది ఓటు వేయగా ఆదివారం కౌంటింగ్‌ ప్రక్రియ జరిపారు. 1415 మంది (95.67 శాతం) ‘నో’ (వద్దు) అని ఓట్‌ చేయగా, 53 మంది (3.58 శాతం) మంది ‘ఎస్‌’ (కావాలి) అని ఓట్‌ చేశారు. 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసిన వారిలో 737 మంది (49.8 శాతం) మహిళలు, 742 మంది (50.16) పురుషులు ఉన్నారు.  

కోర్టులో పిటిషన్‌.. 
‘హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌’ సంస్థ నిర్వహించిన ఈ ఓటింగ్‌ ఫలితాల ఆధారంగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్‌ ఒకసారి, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వైన్‌షాపుల ఏర్పాటుపై పలు సర్వేలు జరిపినట్లు సమాచారం. నగరంలో ఇది రెండో ఓటింగ్‌ ప్రక్రియ. 

     

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)