amp pages | Sakshi

Telangana: పదవుల పందేరం ఎప్పుడు? 

Published on Mon, 01/02/2023 - 01:19

సాక్షి, హైదరాబాద్ః రాష్ట్ర మంత్రి మండలిలో కేబినెట్‌ బెర్త్‌తో పాటు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్‌ పదవులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండటంతో ఖాళీగా ఉన్న కేబినెట్‌ మంత్రి పదవిపై కన్నేసిన ఆశావహులు బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిలో పడేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ, కీలక పదవుల భర్తీ ఉంటుందనే వార్తలు ఎమ్మెలు, నేతలను ఆశలపల్లకిలో విహరింపజేస్తున్నాయి. 

మెదక్‌ జిల్లాలో రైతులకు సంబంధించిన భూ ఆక్రమణల ఆరోపణలపై ఈటల రాజేందర్‌ను 2021 మే చివరి వారంలో సీఎం కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి తప్పించారు. తదనంతర పరిణామాలతో ఈటల బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆయన నిర్వర్తించిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను ఆర్ధిక మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఈటలను కేబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేసి ఏడాదిన్నర గడిచినా ఆయన స్థానంలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోలేదు. సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారంలో మంత్రివర్గాన్ని పాక్షికంగా పునర్వ్యస్థీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న కేబినెట్‌ బెర్త్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తవారికి చోటు కల్పిస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణలో కేబినెట్‌ నుంచి బయటకు వెళ్లేవారు, కొత్తగా చేరేవారు ఎవరనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 

మండలి డిప్యూటీ చైర్మన్‌ పోస్టు ఎవరికో.. 
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌తో పాటు మరో రెండు విప్‌ పదవులు కూడా దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో 2022 మార్చిలో రెండో పర్యాయం మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరగకపోవడంతో 2021 జూన్‌ నుంచి ఖాళీగానే ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌కు ఇంకా రెండున్నరేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయనను ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్‌ శాసన మండలికి నామినేట్‌ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బండా ప్రకాశ్‌ డిసెంబర్‌ 2021లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ఈటల స్థానంలో రాష్ట్ర మంత్రివర్గంలోకి లేదా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి లభిస్తుందనే ప్రచారం జరిగినా ముందుకు సాగలేదు. సుమారు ఏడాదిన్నరగా మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉండటంతో ఆశావహులు కేసీఆర్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఖాళీగానే ప్రభుత్వ విప్‌ పదవులు 
శాసన మండలిలో నలుగురు ప్రభుత్వ విప్‌లకు గానూ ప్రస్తుతం ఎంఎస్‌ ప్రభాకర్‌ ఒక్కరే కొనసాగుతున్నారు. బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా 2019–21 వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. మరోవైపు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2019లో, కర్నె ప్రభాకర్‌ 2020లో, కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్‌ 2022 జనవరిలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.

కర్నె ప్రభాకర్‌ మినహా మిగతా ముగ్గురు మరోమారు శాసన మండలికి ఎన్నికైనా వీరిలో మళ్లీ ప్రభుత్వ విప్‌లుగా ఎవరికి అవకాశం దక్కకపోగా, సుదీర్ఘకాలంగా మండలిలో ప్రభుత్వ విప్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్‌ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.   

Videos

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)