amp pages | Sakshi

మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల‌

Published on Fri, 10/07/2022 - 12:30

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడులైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడించింది. ఇక నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌, 6న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

చండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. శని, ఆదివారం నామినేషన్ల దాఖలుకు సెలవు ఉంటుంది. ఈనెల 14వ తేదీ వరకు జరగనున్న నామినేషన్ల స్వీకరణకు 30 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. చండూరు పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.  నామినేషన్‌ వేసే అభ్యర్థుల వెంట అయిదుగురికి మాత్రమే రిటర్నింగ్‌ కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. 

టీఆర్‌ఎస్‌ అ‍భ్యర్థి ఖరారు
మరోవైపు మునుగోడు ఉపఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలుపొందగా. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.. ప్రస్తుంగా మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి ‍స్రవంతి పోటీ చేస్తున్నారు.

అక్టోబర్‌ 10న బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. 14న కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 13 లేదా 14వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసే అవకాశం ఉంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)