amp pages | Sakshi

క్యూట్‌ బేబీ డాన్స్‌‌..చివర్లో ట్విస్ట్‌

Published on Tue, 12/22/2020 - 16:47

పిల్లలకు అనుకరించే స్వభావం సహజంగానే ఉంటుంది. మొదటగా వాళ్లు తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు. వారు ఏ పని చేసినా అదే చేయడానికి చిన్న పిల్లలు ప్రయత్నిస్తారు. ఆ వయసులో వారికి గ్రాస్పింగ్‌ పవర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏవరేది చేసినా.. వాళ్లు అలా చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొసారి చిన్నవాళ్లు చేసే పనులు నవ్వులు పూయించడంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాయి. అలా ఓ చిన్నారి టీవీలో వస్తున్న పాటకు స్టెప్పులేసి నవ్వులు పూయించడంతో పాటు చివర్లో  ట్విస్ట్‌ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

వీడియో ప్రకారం.. ఓ చిన్నారి.. ప్రభుదేవా ప్రముఖ పాత్రలో నటించిన ‘లక్ష్మి’ సినిమాలోని పాటను టీవీలో చూసి.. స్టెప్పులేయడం మొదలుపెట్టింది. ఆ పాటలో చిన్నారి ఎలా డాన్స్‌ చేస్తే...ఈమె అలాగే చేయడానికి ట్రై చేసింది. అయితే సినిమాలోని చిన్నారి పాటలో భాగంగా బస్సులోని హ్యండిల్‌ పట్టుకొని జంప్‌ చేసింది. దీంతో చిన్నారి కూడా అలా జంప్‌ చేయడానికి ట్రై చేసింది. అటు ఇటు చూసి ఏమి కనిపించకపోవడంతో టీవీనే పట్టుకొని జంప్‌ చేయడానికి ట్రై చేసింది. ఇంకేముంది వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చిన కొత్త టీవీ ముక్కలైపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్నారిని తప్పుపట్టడంలేదు. ఆమె అనుకరణను చూసి ముచ్చటపడుతున్నారు. ‘ఇంత చిన్న బుర్రకి ఎన్ని తెలివితేటలో అని కొనియాడుతున్నారు’, ‘ఇంటలిజెంట్‌ బేబీ’, ట్విస్ట్‌ అదిరింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న పిల్లలు స్వతహా చేసే పనులకు అడ్డుపడకూడదని, అది వారిలో టాలెంట్‌ను బయటపడేలా చేస్తుందని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే మీరు కూడా చిన్న పిల్లలను స్వేచ్ఛగా, నచ్చిన పని చేస్తుంటే అడ్డుపడకండి. అది వాళ్లలోని ప్రతిభను వెలికితీస్తుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty : గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌