amp pages | Sakshi

ఎంపీటీసీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్‌

Published on Mon, 10/10/2022 - 09:54

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారిన ఈ ఎన్నికలు జరుగుతున్న తీరును రాజకీయ పరిశీలకులు, నిపుణులతో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు, సామాన్యులు నిశితంగా గమనిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి క్రమంగా వేడెక్కుతూ వస్తున్న మునుగోడు రాజకీయం నామినేషన్ల దాఖలు సమయానికి మరింత హీటెక్కింది.

ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడం, అన్ని పార్టీలు పోటీలు పడి సభలు, సమావేశాలు నిర్వహించడం, ఆయా పార్టీల ముఖ్య నేతలు మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్నారంటేనే ఈ ఎన్నికను రాజకీయ పక్షాలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతోంది. 

కదన రంగంలోకి పార్టీలు..
మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, జయపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, మాణిక్యరావు, చిరుమర్తి లింగయ్య, రవిశంకర్‌లతో పాటు పలు నియోజకవర్గాల ఇన్‌చార్‌్జలు గ్రామాల్లో తిరుగుతున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇన్‌చార్జ్‌ గా ఉన్న గట్టుప్పలలో సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ నాగయ్యతోపాటు గంప గోవర్ధన్‌ ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇక, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో చురుకుగా పాల్గొంటుండగా ఆ పార్టీ నేతలు వివేక్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ ఎప్పటికప్పుడు వచ్చి కేడర్‌ను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి భూపేందర్‌యాదవ్, ఎంపీ లక్ష్మణ్‌ కూడా వచ్చారు. త్వరలోనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నడ్డాలు కూడా రానున్నారు. ఇక, కాంగ్రెస్‌ నుంచి పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే గ్రామాలను చుట్టివస్తున్నారు. మండలానికి ముగ్గురు ఇన్‌చార్జ్‌ ల చొప్పున టీపీసీసీ నేతలు, స్థానిక నాయకులు గ్రామాల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ ఆదివారం సాయంత్రం చౌటుప్పల్‌ సభలో పాల్గొన్నారు. ఐదు రోజులపాటు నియోజకవర్గంలోనే రేవంత్‌రెడ్డి మకాం వేయనున్నారు. 

మరోమారు సభలు..
మూడు ప్రధాన రాజకీయపక్షాలు మరోమారు బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షా, నడ్డాలతో ఒకటి లేదంటే రెండు సభలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, భారత్‌జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న రాహుల్‌గాంధీ పాల్గొనేలా నియోజకవర్గానికి సమీపంలో ఉన్న శంషాబాద్‌లో సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీలు బీసీ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ సామాజిక వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ నియోజకవర్గంలోని యాదవ సామాజికవర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు.

సీఎం పర్యవేక్షణ.. 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం సీఎం కేసీఆర్‌ స్వయంగా ఓ ఎంపీటీసీ స్థానం ఇన్‌చార్జ్‌ బాధ్యతలను తీసుకోవడం విశేషం. ఆ గ్రామానికి సంబంధించిన పరిస్థితి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో పర్యవేక్షిస్తున్నారని గులాబీ శ్రేణులంటున్నాయి. మొత్తంమీద మూడు పార్టీల ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో మునుగోడు నియోజకవర్గ పొలిటికల్‌ థియేటర్‌లో అన్ని షోలు హౌజ్‌ఫుల్‌ కావడం గమనార్హం. 

సెమీఫైనల్‌లో సత్తా చాటేందుకు 
రాబోయే అసెంబ్లీ ఎన్నిలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్‌ లాంటిదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అనూహ్యమైన సంఘటనలు జరిగితే తప్ప 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు, ఆయా పార్టీలకు లభించే ఓట్లను బట్టి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని ప్రధాన రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణలో తామే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు బీజేపీ, మునుగోడులో గెలవడం ద్వారా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని చెప్పుకునేందుకు గులాబీ పార్టీ, సిట్టింగ్‌ స్థానంలో గెలుపు ద్వారా తమపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి తమకు మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో గెలిచిన పార్టీకి 2023 ఎన్నికలకు వెళ్లడం సులువవుతుందని, ఓడిన పార్టీలు మాత్రం ఓటమి భారంతోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది.  

Videos

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)