పాదయాత్ర పొడవునా దరఖాస్తుల ఉద్యమం

Published on Tue, 08/17/2021 - 01:54

కరీంనగర్‌టౌన్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేందుకే దరఖాస్తుల ఉద్యమాన్ని బీజేపీ చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 24 నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామయాత్ర’లో పాదయాత్ర పొడవునా దరఖాస్తుల ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయా పథకాల దరఖాస్తు ఫారాలను ఆయ న ఆవిష్కరించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ దరఖాస్తులన్నీ నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌సహా సీఎం కార్యాలయాల్లో సమర్పిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పట్ల గౌరవం, దళితులపట్ల ప్రేమ ఉంటే, ‘దళితబంధు’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తం గా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

‘బీసీబంధు’, ‘గిరిజనబంధు’ పథకాలను ప్రభుత్వం రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 లక్షల బీసీ కుటుంబాలు, 10 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున లబ్ధి చేకూర్చాలని కోరారు. నిరుద్యోగులకు 2018లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ప్రతినెలా రూ.3,116 నిరుద్యోగ భృతి చెల్లించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీమంత్రి సుద్దాల దేవయ్య, సీని యర్‌ నేతలు బొడిగె శోభ, కటకం మృత్యుంజయం, తుల ఉమ పాల్గొన్నారు. కాగా, 40 రోజులపాటు సాగనున్న బండి సంజయ్‌ తొలివిడత ‘ప్రజా సంగ్రామయాత్ర’కు అనుమతి కోరుతూ డీజీపీ మహేందర్‌రెడ్డికి బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనుమతి నిమిత్తం రూట్‌మ్యాప్, రాత్రి బస, పాల్గొనబోయే నేతలు తదితర సమాచా రాన్ని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, నేతలు డి.ప్రదీప్‌కుమార్, ఎస్‌.కుమార్, వీరేందర్‌గౌడ్, దీపక్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం డీజీపీకి అందజేసింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ