Breaking News

WTC Final: టీమిండియా బహుపరాక్‌.. ఓవల్‌లో స్టీవ్‌ స్మిత్‌ను ఆపడం​ చాలా కష్టం..!

Published on Sun, 06/04/2023 - 17:00

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం బయపెడుతుంది. అదేంటంటే.. ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు మ్యాచ్‌ వేదిక అయిన ఓవల్‌లో అద్భుతమైన రికార్డు ఉండటం. ఈ ఆసీస్‌ స్టార్‌ ఓవల్‌ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 97.75 సగటున 391 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (138*, 143), ఓ హాఫ్‌ సెంచరీ (80) ఉన్నాయి. ఓవల్‌లో స్మిత్‌కు ఉన్న ఈ రికార్డే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. 

స్మిత్‌కు కళ్లెం వేసే వ్యూహరచనలో భారత బౌలర్లు నిమగ్నమయ్యారు. అతన్ని ఎలాగైనా తొందరగా ఔట్‌ చేయాలని వారు భావిస్తున్నారు. స్మిత్‌ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్మిత్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపితే మంచిదని, అతను క్రీజ్‌లో కుదురుకుంటే చాలా ప్రమాదమని వారు వార్నింగ్‌ ఇస్తున్నారు. 

స్మిత్‌కు ఇంగ్లండ్‌లో వాతావరణ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహణ ఉందని, అక్కడి పిచ్‌లపై అతను ఏకంగా 6 శతాకలు బాదాడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు స్మిత్‌కు టీమిండియాపై కూడా ఘనమైన రికార్డు ఉన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. స్మిత్‌ భారత్‌పై 35 ఇన్నింగ్స్‌లు ఆడి 65.07 సగటున 8 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు సాయంతో 1887 పరుగులు చేశాడన్న విషయాన్ని మరవకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా స్మిత్‌తో జాగ్రత్తగా ఉండాలని, లేదంటి అతను మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడని వార్నింగ్‌ ఇస్తున్నారు.

కాగా, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు