Breaking News

WC 2023: అతడు అవుట్‌ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్‌

Published on Sat, 10/28/2023 - 08:31

ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం విచారం వ్యక్తం చేశాడు.

అలా అయితే ఫలితం వేరేలా ఉండేది
తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో హ్యాట్రిక్‌ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్‌.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రొటిస్‌ టెయిలెండర్‌ కేశవ్‌ మహరాజ్‌ ఫోర్‌ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్‌ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది.

అందుకే ఓడిపోయాం
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్‌ ఆజం.. తమ ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.

అతడు అవుట్‌ అయితే సెమీస్‌ రేసులో ఉండేవాళ్లం
అదే విధంగా.. 46వ ఓవర్‌ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్‌ తబ్రేజ్‌ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్‌కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్‌ఎస్‌ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్‌గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది.

సెమీస్‌ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్‌ కాల్‌ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్‌లలో బాగా ఆడి పాకిస్తాన్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్‌.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు. 

హైడ్రామా..
కాగా పేసర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్‌కు అంపైర్స్‌ కాల్‌ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్‌ సంధించిన ఇన్‌స్వింగర్‌ లెగ్‌ స్టంప్స్‌ను తాకినట్లుగా అనిపించింది.

అయితే, బాల్‌ ట్రాకింగ్‌లో తృటిలో మిస్‌ అయినట్లు కనిపించగా.. నాటౌట్‌గా పేర్కొన్న అంపైర్స్‌ కాల్‌ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్‌ వరకు హైడ్రామా నడవగా కేశవ్‌ మహరాజ్‌ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు.

పాకిస్తాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా స్కోర్లు:
►వేదిక: చెన్నై చెపాక్‌ స్టేడియం
►టాస్‌: పాకిస్తాన్‌- తొలుత బ్యాటింగ్‌
►పాక్‌ స్కోరు: 270 (46.4)
►సౌతాఫ్రికా స్కోరు:  271/9 (47.2)
►ఫలితం: ఒక్క వికెట్‌ తేడాతో సౌతాఫ్రికా విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: తబ్రేజ్‌ షంసీ(4 వికెట్లు)

చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్‌ కూడా..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)