amp pages | Sakshi

ఈ ఎండల్లో ఆడి చావమంటారా..? స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారుడి ఆగ్రహం

Published on Thu, 07/29/2021 - 15:49

టోక్యో: ఒలింపిక్స్‌కు వేదికైన టోక్యో నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్‌ మ్యాచ్‌లను మాధ్యాహ్నం వేళల్లో నిర్వహించడంపై ప్రపంచ నంబర్‌ 2 టెన్నిస్‌ క్రీడాకారుడు డేనిల్‌ మెద్వెదెవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరియాకె టెన్నిస్‌ పార్క్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో భానుడి ప్రతాపం ధాటికి మెద్వెదెవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌ సందర్భంగా మెద్వెదెవ్‌ డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. 

ఎండ వేడిమిని తాళలేక మ్యాచ్‌ మధ్యలో చైర్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. నేను యోధున్ని కాబట్టి గేమ్‌ను ఎలాగైనా పూర్తి చేస్తాను. ఈ మధ్యలో నేను చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ నిర్వాహకలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా మ్యాచ్‌ల నిర్వహణ సమయాన్ని మారుస్తారా లేక ఈ ఎండల్లో ఆడి చావమంటారా అంటూ నిర్వహకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా, నిప్పులు కక్కుతున్న భానుడి ప్రతాపం కారణంగా అరియాకె టెన్నిస్‌ పార్క్‌లో బుధవారం ఇద్దరు ఆటగాళ్లు వడదెబ్బతో మధ్యలోనే నిష్క్రమించారు. 

ఇదిలా ఉంటే, క్రీడాకారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వాహకులు స్పందించారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మారుస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు (జపాన్‌ కాలమానం ప్రకారం) మొదలు కావాల్సిన మ్యాచ్‌లు గురువారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు. కాగా, మూడో రౌండ్‌ మ్యాచ్‌లో రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌వోసీ) ఆటగాడు మెద్వదెవ్‌.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిపై 6-2, 3-6, 6-2తేడాతో విజయం సాధించి, క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.  
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)