amp pages | Sakshi

T20 WC 2021: మూడేళ్ల రికార్డు బద్దలు కొట్టిన నెంబర్‌వన్‌ బౌలర్‌

Published on Sat, 10/30/2021 - 18:17

Tabriaz Shamsi Most Wickets In Calender Year.. టి20 క్రికెట్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రెయిజ్‌ షంసీ అరుదైన ఘనత సాధించాడు. టి20ల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో  ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాడిగా షంసీ రికార్డు సాధించాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో షంసీ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఈ రికార్డును అందుకున్నాడు.2021 ఏడాదిలో టి20ల్లో షంసీ 32 వికెట్లు పడగొట్టి మూడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా షంసీ సౌతాఫ్రికా తరపున 45 టి20ల్లో 53 వికెట్లు.. 2 టెస్టుల్లో 6 వికెట్లు.. 30 వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: SA Vs SL: నోర్జ్టే సూపర్‌ డెలివరీ.. పెరీరాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయుంటాయి 

2018 క్యాలండర్‌ ఇయర్‌లో ఆండ్రూ టై 31 వికెట్లు సాధించాడు. ఇక ఐసీసీ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షంసీ ప్రస్తుతం నెంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదిలోనే మరో ఇద్దరు క్రికెటర్లు కూడా టి20ల్లో ఒకే ఏడాదిలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చోటు సంపాధించారు. వారే ఉగాండాకు చెందిన దినేష్‌ నకర్ణి(31 వికెట్లు), వసీమ్‌ అబ్బాస్‌(29 వికెట్లు) ఉన్నారు. 

చదవండి: SA Vs SL: డికాక్‌ మోకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌