amp pages | Sakshi

ENG VS PAK: రాణించిన షాన్‌ మసూద్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 161

Published on Mon, 10/17/2022 - 16:14

టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 17) ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓ మోస్తరు స్కోర్‌ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు షాన్‌ మసూద్‌ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్‌ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు)  ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు.

తాత్కాలిక కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ (12), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (22),  ఖుష్దిల్‌ (0), ఆసిఫ్‌ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు‌. ఆఖర్లో మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌) వేగంగా పరుగులు సాధించడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్‌ స్టోక్స్‌,  సామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లివింగ్‌స్టోన్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ (1), అలెక్స్‌ హేల్స్‌ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వన్‌ డౌన్‌లో వచ్చిన బెన్‌ స్టోక్స్‌ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 7.2 ఓవర్లు పూర్తియ్యే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 63/3గా ఉంది. లివింగ్‌స్టోన్‌ (5), హ్యారీ బ్రూక్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు.  ఇంగ్లండ్‌ గెలవాలంటే 70 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)