Breaking News

ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు

Published on Wed, 10/18/2023 - 12:11

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్‌తో నిన్న (అక్టోబర్‌ 17) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు రికీ భుయ్‌ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్‌ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. అభిషేక్‌ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.

అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్‌.. పంజాబ్‌ బౌలర్లు హర్ప్రీత్‌ బ్రార్‌ (4-1-18-3), సిద్దార్థ్‌ కౌల్‌ (2/40), అర్షదీప్‌ సింగ్‌ (1/37), ప్రేరిత్‌ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (104 నాటౌట్‌) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్‌ హెబ్బర్‌ (17), త్రిపురన విజయ్‌ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)