చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్‌ గిల్! సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్ను

Published on Sun, 11/19/2023 - 10:58

ICC CWC Final 2023: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 తుది‌ సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌ వేదికగా ఈ ఫైనల్‌ పోరుకు తెరలేవనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఆసీస్‌తో మ్యాచ్‌లో గిల్‌ మరో 31 పరుగులు సాధిస్తే ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. తద్వారా క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమిస్తాడు.

కాగా 2023  క్యాలెండర్ ఇయర్‌లో గిల్‌ ఇప్పటివరకు 1580 పరుగులు చేశాడు. అంతకుమముందు 1996 ఏడాదిలో సచిన్‌ 1611 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో సచిన్‌ వరల్డ్‌ రికార్డును గిల్‌ బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ఇక గిల్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 350 పరుగులు సాధించాడు. రోహిత్‌ శర్మతో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు.

ఒక క్యాలెండర్ ఇయర్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
►సచిన్ టెండూల్కర్ (1996)- 1,611 పరుగులు
►శుబ్‌మన్‌ గిల్ (2023)-1,580 పరుగులు
► విరాట్ కోహ్లీ (2011)-1381 పరుగులు
►మహేల జయవర్ధనే (2001)-1,260 పరుగులు
►కేన్ విలియమ్సన్ (2015)- 1,224 పరుగులు

చదవండి: CWC 2023 Final: అతడే మాకు అతిపెద్ద సవాల్‌.. హోరెత్తే స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం: ఆసీస్‌ కెప్టెన్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ